పాదాల వాపుతో ఇబ్బంది పడుతున్నారా…తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి!

కొందరిలో అప్పుడప్పుడు పాదాల వాపు, తిమ్మిర్లు, అరికాళ్ళ మంటలు, కాళ్లు లాగడం, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీనికి గల కారణాలను పరిశీలిస్తే గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడంతో పాదాలకు రక్తప్రసరణ తగ్గి వాపులు, తిమ్మిర్లు వంటి సమస్యలు ఎత్తవచ్చు. అలాగే ఎక్కువసేపు నడిచిన, నిలబడిన, ఎక్కువ బరువులెత్తినా కూడా పాదాలపై అధిక ఒత్తిడి పడి పాదాల్లో వాపు, నొప్పి సమస్య తలెత్తుతుంది. నీళ్లు తక్కువ తాగే వారిలో పాదాల్లో వాపు వస్తుంది. ఇవన్నీ సాధారణమైన సమస్యలే వీటికి కంగారు పడకుండా మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పాదాల వాపు తగ్గిపోతుంది.

రోజువారి కార్యకలాపాల్లో నిమగ్నమై ఎక్కువసేపు గంటల తరబడి కూర్చొని పనిచేస్తుంటారు. అలాకాకుండా అప్పుడప్పుడు కాసేపు లేచి నిలబడడం అటు ఇటు తిరగడం మంచిది చేస్తూ ఉంటే పాదాలకు రక్తప్రసరణ సరిగా అందుతుంది. పనిలో నిమగ్నమై నీళ్లు తాగడం కూడా మర్చిపోతుంటారు. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షలతోపాటు కిడ్నీ సమస్య కూడా తలెత్తుతుంది కావున దప్పిగా లేకపోయినా అప్పుడప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. మీ శక్తికి మించి బరువులు ఎత్తడం, అదేపనిగా ఎక్కువసేపు నిలబడడం వంటి వంటి పనులు అసలు చేయకండి. పాదాల్లో వాపు కనిపించినప్పుడు 20 నిమిషాల పాటు పాదాలను ఎత్తులో ఉంచడం వల్ల రక్తప్రసరణ సరిగా జరిగి తొందరగా వాపు తగ్గుతుంది.

ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా పాదాల్లో వాపు రావచ్చు ఈ సమస్య నుంచి బయటపడడానికి యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్న ఆవనూనెలో పసుపు కలిపి వాపు ఉన్నచోట మర్దన చేసుకుంటే సమస్య తగ్గుతుంది. అలాగే ఉప్పు నీటిలో కొద్దిసేపు పాదాలను ఉంచితే చెడు మలినాలు తొలగి వాపు సమస్య తొందరగా తగ్గుతుంది. ఐరన్ సమృద్ధిగా కలిగిన పాలకూర,బీట్రూట్, దానిమ్మ, జామ బొప్పాయి వంటి పండ్లను కూరగాయలను ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అప్పుడే ఐరన్ సమృద్ధిగా లభించి శరీర అవసరాలకు సరిపడా రక్తం నిల్వలు వృద్ధి చెందుతాయి.

పాదాల వాపు సమస్య ఎక్కువ రోజులు మిమ్మల్ని వేధిస్తుంటే మీలో ఏదో అనారోగ్య సమస్య తలెత్తుతోందని గుర్తించాలి. వెంటనే వైద్య సలహాలు తీసుకొని తగిన జాగ్రత్త పాటించడం మంచిది.