చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవాల్సిందే!

తులసి మొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎన్నో మొండి వ్యాధులను నయం చేయడంతో పాటు చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి.ముఖ్యంగా తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్సు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సీజనల్గా వచ్చే చర్మ అలర్జీలను, ఇంజక్షన్లను తగ్గించడంలో సహాయపడడమే కాకుండా దీర్ఘకాలంగా వేధించి చర్మ క్యాన్సర్లను అదుపు చేయడంలో సహాయపడతాయి.

సహజ పద్ధతిలో చర్మ సమస్యలను తొలగించుకొని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ముందుగా తులసి ఆకులను మెత్తని చూర్ణంగా మార్చుకున్న తర్వాత అందులో శెనగపిండి,పసుపు తగిన మోతాదులో వేసుకొని మెత్తటి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకొని తులసి మిశ్రమాన్ని ప్యాక్ గా వేసుకునీ అరగంట తర్వాత శుభ్రం చేసుకున్నట్లయితే ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు నశించి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

తుల‌సి ఆకుల‌ను మెత్తటి మిశ్రమముగా మార్చుకొని అందులో కొన్ని రోజ్‌వాట‌ర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించుకున్న పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొడి చ‌ర్మం త‌గ్గి కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. దీనికి కొంచం నీరు కలిపి ముఖానికి రాసుకోన్న పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

తులసి ఆకులతో నిమ్మరసం కలిపి మెత్తని పేస్టులా మార్చుకుని వారానికి రెండుసార్లు ముఖానికి పట్టించుకున్నట్లయితే ముఖంపై మొటిమలు, మచ్చలు స్వల్పకాలంలోనే తొలగిపోతాయి.
వారానికి రెండు లేదా మూడుసార్లు తుల‌సి ఆకుల‌ల్లో కొద్దిగా పెరుగు కలిపి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత ముఖంపై ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉండే మృత కణాలు తొలగి నిత్య యవ్వనంగా కనిపిస్తారు.అలాగే చర్మంపై ట్యాన్ తొలగి మచ్చలు, ముడతలు, అలర్జీలు వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.