ఈ మధ్య కాలంలో ఎక్కువమందికి బరువు భారంగా మారుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులువుగా, తేలికగా బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 – 30 – 30 పద్ధతిని ఫాలో కావడం ద్వారా సులువుగానే బరువు తగ్గవచ్చు. 30 గ్రాముల ప్రోటీన్, 30 నిమిషాల నడక, 30 నిమిషాల మితమైన వ్యాయామం ద్వారా మంచి ఫలితాలను సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతోంది. అల్పాహారంలో 30 గ్రాముల ప్రోటీన్ ను చేర్చుకుంటే కండరాలు బలపడే అవకాశం ఉంటుంది. మాంసం, గుడ్లు, పాలు, గింజలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయాన్నే 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో పాటు సులువుగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.
30 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తే అధిక బరువు సమస్యలను నివారించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అధిక ప్రోటీన్ (30%) కండరాల మరమ్మత్తు, సరైన జీవక్రియకు ఉపయోగపడతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆరోగ్య కరమైన కొవ్వులు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తినడం ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి.
బరువు తగ్గడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. బరువు తగ్గడం ద్వారా దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు సరైన దారిలో అడుగులు వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.