మీ దంతాలు తెల్లగా మెరవాలనుకుంటున్నారా.. ఈ చిట్కాలు కచ్చితంగా పాటించాల్సిందే!

మనలో చాలామంది దంతాల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. దంతాలు పసుపు రంగులో ఉండటం వల్ల చాలామంది అన్ కంఫర్టబుల్ గా ఫీలయ్యే అవకాశంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. బేకింగ్ సోడాను ఉపయోగించడం ద్వారా దంతాలను తెల్లగా మార్చుకోవడంతో పాటు నోటిలో ఉండే పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయని చెప్పవచ్చు.

బేకింగ్ సోడాతో ఉన్న పేస్ట్ సహాయంతో దంతాలను శుభ్రం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వారానికి ఒకరోజు లేదా రెండు రోజులు ఈ విధంగా చేస్తే బెటర్. నారింజ తొక్కల పొడిని ఉపయోగించి దంతాలను శుభ్రం చేయడం ద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుంది. దంతాలను తెల్లగా మార్చడానికి యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒక విధంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

వెనిగర్ ను నీటిలో కలిపి వారానికి ఒకటి లేదా రెండుసార్లు పళ్లకు మర్ధనా చేయడం ద్వారా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. వేపాకులు, జామ కూడా దంతాలను సులువుగా తెల్లగా మారుస్తుందని చెప్పవచ్చు. ఈ చిట్కాలు పాటించినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేకపోతే వైద్యులను సంప్రదించాలి.

దంతాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దంతాల మధ్య ఆహారం చిక్కుకోవడం వల్ల, బ్యాక్టీరియా కల్ల కీళ్ల సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తె ఛాన్స్ అయితే ఉంటుంది. దంతాల విషయంలో కేర్ తప్పనిసరి అని వైద్యులు సైతం చెబుతుండటం గమనార్హం.