మనలో చాలామంది ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. అరిటాకులో భోజనం చేయడం ద్వారా అద్భుతమైన లాభాలు, ప్రయోజనాలను పొందవచ్చు. అరిటాకులో భోజనం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పేపర్ ప్లేట్స్ లో భోజనం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లకు అరిటాకుల్లోనే భోజనాలను వడ్డిస్తున్నారు.
అరిటాకులో భోజనం చేయడం వల్ల సులువుగానే ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అరిటాకు ఆహార పదార్థాలకు రుచిని పెంచడంతో పాటు కమ్మటి భోజనం తిన్నామనే భావనను కలిగిస్తుంది. అరిటాకులో ఉండే విటమిన్స్, లవణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా జీర్ణ శక్తి మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
కొన్ని రకాల క్యాన్సర్లు దరి చేరకుండా చేయడంలో అరిటాకు తోడ్పడుతుంది. అరిటాకులో భోజనం చేయడం ద్వారా పార్కిన్సన్ వ్యాధి బారిన పడే ఛాన్స్ కూడా ఉండదు. గ్యాస్, అసిడిటీ, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో అరిటాకు తోడ్పడుతుంది. ఒత్తిడి, ఆందోళన సమస్యలకు చెక్ పెట్టడంలో కూడా అరిటాకు సహాయపడుతుంది. అరిటాకులో భోజనం చేయడం ద్వారా ఆహారంలో ఏవైనా సూక్ష్మ క్రిములు ఉంటే మృతి చెందుతాయి.
అరిటాకులను వాడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అరిటాకులను ఉపయోగించడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. పట్టణాల్లో నివశించే వాళ్లు అరిటాకుల ఖరీదు ఎక్కువైనా వాటిని కొనుగోలు చేస్తే మంచిది.