ఈ రోజుల్లో ఎవ్వరిని పలకరించిన ఏదో ఒక అనారోగ్య సమస్యతో నిత్యం పోరాటం చేస్తున్నామనే చెబుతుంటారు. పూర్వపు రోజుల్లో 60 సంవత్సరాల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు కానీ ఈ రోజుల్లో క్రిమిసంహారక మందులు, ఎరువులు అధికంగా ఉపయోగించే ఫుడ్ తినడం వల్ల మరియు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కు అలవాటు పడటం వల్ల చిన్న వయసులోనే ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి తోడు తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల తొందరగా శరీర బరువు పెరిగి డయాబెటిస్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు వంటి సమస్యలు అధికమవుతున్నాయి.
శారీరక శ్రమ తక్కువగా ఉండి ప్రతిరోజు వ్యాయామం చేయలేని వారు రోజువారి ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించే గుమ్మడి గింజలు, చియా గింజలు,పుచ్చకాయ గింజలు, అవిసె గింజల తో తయారుచేసిన రుచికరమైన ఆరోగ్యకరమైన లడ్డూలను మన డైట్ లో చేర్చుకుంటే సహజ పద్ధతిలో ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలతో రుచికరమైన లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మొదట ఒక పాత్రలో తగినన్ని నీళ్లు తీసుకొని అందులో బెల్లం వేసి బాగా మరగనిచ్చిన తర్వాత బెల్లం కరిగి పాకంలో మారుతుంది.తర్వాత మనం నెయ్యిలో దోరగా వేయించి పెట్టుకున్న గుమ్మడి, చియా,అవిసె,పుచ్చ గింజలను, ఓట్స్ ను బెల్లం పాకం మిశ్రమంలో వేసుకొని బాగా కలియతిప్పి కొద్దిగా గట్టిపడిన తర్వాత చిన్నచిన్న లడ్డులు తయారు చేసుకుని గాజు జారులో భద్రపరచుకొని రోజువారి డైట్ లో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమైనట్లే.