ప్రతిరోజు జొన్న అన్నాన్ని తింటే ఎన్నో ప్రమాదకర వ్యాధులకు పరిష్కారం లభించినట్లే తెలుసా?

Benefits-Of-Sorghum

రోజువారి ఆహారంలో జొన్న చిరుధాన్యంతో తయారుచేసిన జొన్న రొట్టెలు ,జొన్న అన్నం, జొన్న ముద్ద , జొన్న పాయసం, జొన్న బిస్కెట్లను ఎక్కువగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు చెప్పడానికి గల కారణాలను పరిశీలిస్తే ముఖ్యంగా జొన్న ధాన్యంలో అత్యధిక ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ , విటమిన్స్, మినిరల్స్ లభించి మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వైట్ రైస్ తో పోల్చినప్పుడు జొన్న ధాన్యంలో అత్యల్ప క్యాలరీలు, అత్యధిక పీచు పదార్థం లభ్యమవుతుంది కావున జొన్న అన్నాన్ని తింటే డయాబెటిస్, బిపి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని చెప్పొచ్చు.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజువారి ఆహారంలో జొన్న రొట్టెలు, జొన్న అన్నాన్ని ఎక్కువగా తింటే జొన్నలో అత్యధికంగా లభ్యమయ్యే పీచు పదార్థం, అమైనో ఆమ్లాల రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అలాగే జొన్న గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి చర్మ క్యాన్సర్ ,ఉదర క్యాన్సర్ , బోన్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది.

జొన్నలు అత్యధికంగా ఉండే ఫైబర్ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండెపోటు, రక్తపోటు, ఉబకాయ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.జొన్నల్లో క్యాల్షియం మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండి మన శరీరంలోని ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్తియోఫోరోసిస్ వ్యాధిని అదుపు చేసి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. జొన్నలో అత్యధికంగా లభ్యమయ్యే పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థ లోపాలను తొలగించి హైబీపీ సమస్యను తగ్గిస్తుంది. గ్యాస్టిక్, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.