పీరియడ్స్ సమయంలో ఈ ఆహారం తీసుకుంటే ఆ సమస్యలు దూరమట.. ఏమైందంటే?

పీరియడ్స్ సమయంలో మహిళలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పీరియడ్స్ సమయంలో కొంతమందిని విపరీతమైన కడుపునొప్పి సమస్య వేధిస్తుంది. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరింత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలను సులభంగా దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాల విషయానికి వస్తే పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శక్తి వచ్చి నీరసం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పీరియడ్స్ సమయంలో వేడి వేడి అల్లం టీ తీసుకోవడంతో పాటు ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బచ్చలికూర, అరటిపండు, గుమ్మడికాయ, దుంప వంటి ఆమారాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మిల్క్‌షేక్‌లు, పెరుగు, పాలు, నాన్ వెజ్, గుడ్డు, చేపలు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పులు తీసుకుంటే శరీరాన్ని కాల్షియం సమస్య వేధించే అవకాశాలు అయితే ఉండవు. డార్క్ చాక్లెట్‌ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి.

అల్లం టీ తాగడం వల్ల వికారం తగ్గడంతో పాటు కండరాల నొప్పి సైతం తగ్గుతుంది. పెరుగు, దానిమ్మగింజలు, ఊరగాయ పచ్చళ్లకు మాత్రం తీసుకోకూడదు. పీరియడ్స్ సమయంలో వీటిని తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది.