బాలకృష్ణ ప్రత్యేక పూజలు..వెనక అసలు సీక్రెట్

బాలకృష్ణ ప్రత్యేక పూజలు..వెనక అసలు సీక్రెట్

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా అంబాజీ పేట దగ్గరలోని పుల్లేటికుర్రులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక శ్రీ చౌడేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి పూజలు నిర్వహించారు. రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, స్వామి వారికి రుద్రాభిషేకాలను నిర్వహించారు.

వేదపండితుడు కారుపర్తి నాగమల్లేశ్వరరావు సిద్ధాంతి ఆధ్వర్యంలో పురోహితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. బాలకృష్ణ పర్యటన అత్యంత గోప్యంగా జరిగింది. శుక్రవారం ఉదయం నుంచి పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించి మీడియాను సైతం అనుమతించలేదు. పూజాది క్రతువులు ముగించుకువెళుతున్న సమయంలో బాలకృష్ణ, మోక్షజ్ఞలు మీడియా కంట పడడంతో కెమేరాలు క్లిక్‌మనిపించాయి. అయితే ఎందుకింత హఠాత్తుగా ఆయన ప్రత్యేక పూజలు జరిపించారనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంలో భాగంగానే ఈ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. పూజారులు మాత్రం కొత్త సినిమా కోసం పూజలు చేసారని అంటున్నారు .పూజా కార్యక్రమాలు అయ్యాక బాలయ్య ఒక కారులో మోక్షజ్ఞ మరో కారులో వెళ్లిపోయారు . మోక్షాజ్ఞ ఆకారం చూసి షాక్ అయ్యారు అక్కడ ఉన్న జనాలు .