‘ఆర్‌ఆర్‌ఆర్‌’:150 కోట్లకు శాటిలైట్ రైట్ ఆఫర్, సరిపోదన్న నిర్మాత

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో సంచలనం గా మారింది. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం జీ టీవి వారు 150 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే నిర్మాత దానయ్య …ఆ రేటు తమకు వర్కవుట్ కాదని రెండు వందల కోట్లు అడిగినట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ మొత్తం తెలుగు,తమిళ, హిందీ భాషల శాటిలైట్ రైట్స్ తో పాటు, డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ తో కలిపి అని తెలుస్తోంది. రీసెంట్ గా రోబో 2 హక్కులను 110 కోట్లకు జీటీవి లాక్ చేయటంతో ఈ సినిమా రైట్స్ కూడా వీళ్లకే దక్కుతాయని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటికి రాలేదు. సోషల్ మీడియాలో ఈ చిత్ర కథ ఇదేనంటూ పలు కథనాలు వెలువడినాయి కానీ.. చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎటువంటి సమాచారం అఫీషియల్‌గా రాలేదు.