రాజమౌళి అబద్దం చెప్పాడా..ఈ ఫొటో సాక్ష్యమా?
స్టార్ డైరక్టర్ రాజమౌళి అంటే అందరికీ అభిమానమే. తెలుగు సినిమా స్దాయిని అంతర్జాతీయంగా ఎదిగేలా చేసారని అందరూ మెచ్చుకుంటారు. అందుకు తగినట్లే ఆయన కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. అలాంటి ఆయన అబద్దం చెప్పారంటూ ఓ వార్త ఇప్పుుడు మీడియాలో,సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే…
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో గతవారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మహా సభలు జరిగాయి. వాటిల్లో రాజమౌళి పాల్గొంటారని ప్రచారం జరిగింది. అదే సమయంలో రాజమౌళి వాషింగ్టన్ వెళ్లడం కూడా ఈ ప్రచారానికి బలమిచ్చింది. అయితే వెంటనే రాజమౌళి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘వ్యక్తిగత పని మీద వాషింగ్టన్ వచ్చాను. ‘తానా’ సభల్లో పాల్గొనడం లేదు, పెద్దన్న(కీరవాణి) మ్యూజిక్ కాన్సెర్టుకు కూడా నేను హాజరు కాకపోవచ్చు. నేను వస్తానని ఎదురు చూసే వారికి క్లారిటీ ఇవ్వాలనే ఈ ట్వీట్ చేస్తున్నాను’ అన్నారు. అంతవరకూ బాగానే ఉంది.
అయితే ఆయన హఠాత్తుగా తానా సభల్లో కనిపించారు. అదే ఇప్పుడు మీడియాలో చర్చగా మారింది. ఈ మేరకు ఫొటో ఒకటి సాక్ష్యంగా షేర్ అవుతోంది. జులై 4న కీరవాణి పుట్టినరోజు కావడంతో అన్నయ్యను విష్ చేయడానికే ‘తానా’ సభలు జరుగుతున్న చోటుకు వచ్చాడని కొందరు అంటున్నారు. కేవలం అన్నయ్యను విష్ చేయడానికే అయితే హోటల్ రూములో వెయిట్ చేయొచ్చుకదా… ట్విట్టర్లో తాను రావడం లేదని సంకేతాలు ఇచ్చి, మళ్లీ అక్కడికే వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దాంతో రాజమౌళి డబుల్ స్టాండర్డ్స్ అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విషయమై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి.