పేరు మార్చుకుంటున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రైజింగ్ స్టార్‌గా వెలిగిపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కొన్ని వ‌రుస విజ‌యాలు అత‌డిని స్కైలోకి లేపాయ‌నే చెప్పాలి. అర్జున్ రెడ్డి- గీత గోవిందం సంచ‌ల‌న విజ‌యాలు అత‌డి స్థాయిని పెంచాయి. అయితే అనూహ్యంగా డియ‌ర్ కామ్రేడ్ ఫ్లాప‌వ్వ‌డం అత‌డిని ఇబ్బంది పెట్టింది. అయితే ఈలోగానే పూరి-చార్మితో క‌లిసి క‌ర‌ణ్ జోహార్ అల‌యెన్స్ తో పాన్ ఇండియా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబో `ఫైట‌ర్` ప్ర‌స్తుతం  ముంబైలో తెర‌కెక్కుతోంది.

తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న పేరును మ‌ర్చుకుంటున్నాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇంత‌కీ విజ‌య్ అస‌లు పేరు అది క‌దా? అంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ సాయి! అన్న‌ది అత‌డి పూర్తి నామ‌ధేయం అని తెలుస్తోంది. స్క్రీన్ వ‌ర‌కూ విజ‌య్ దేవ‌ర‌కొండ అని షార్ట్ చేశారు. అయితే ఈసారి తెర‌పైనా విజ‌య్ సాయి అని కనిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ పేరును డియ‌ర్ కామ్రేడ్ సినిమా నుంచి టైటిల్స్ లో వేసి అమ‌లు చేస్తున్నారా?   లేక  ఫైట‌ర్ తెర‌పై క‌నిపిస్తుందా అన్న‌ది దేవ‌ర‌కొండ‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇటీవ‌లి కాలంలో పేరు మార్పు విష‌య‌మై టాలీవుడ్ లో చ‌ర్చ సాగుతోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ పేరు కాస్తా సాయి తేజ్ గా మార్చుకున్న త‌ర్వాత అత‌డికి రెండు వ‌రుస విజ‌యాలు క‌లిసొచ్చిన సంగ‌తి తెలిసిందే.–