లైగర్ సినిమాకి సీక్వెల్ రాబోతోందా… విజయ్ మాటలకు అర్థం అదేనా?

ప్రస్తుత కాలంలో ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది అంటే వెంటనే ఆ సినిమాకి సీక్వెల్ చిత్రం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల సీక్వెల్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా మరికొన్ని సినిమాలు సీక్వెల్ చిత్రాలను ప్లాన్ చేస్తూ ప్రేక్షకు ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.అయితే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి లైగర్ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఈ సినిమా సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చార్మి డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండను ఒక ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా చార్మి విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ లైగర్ సినిమా సీక్వెల్ ఉంటుందా అని అడిగారు. చార్మి ఇలా అడిగేసరికి విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

లైగర్ సినిమా సీక్వెల్ ఉంటుంది ఉండొచ్చు అంటూ సమాధానం చెప్పడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని,ఈ సినిమా విడుదలయి మంచి వసూలు రాబడితే తప్పకుండా సీక్వెల్ ఉంటుందని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా సమాధానం చెప్పారు.ఇలా విజయ్ దేవరకొండ ఉండొచ్చు అని సమాధానం చెప్పడంతో తప్పకుండా ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ విషయం గురించి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు కూడా తెలుస్తుంది.