పుష్ప క్లైమాక్స్ చాలా నచ్చింది.. పూరి కామెంట్స్ వైరల్!

టాలివుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమా హిట్ లతో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వార పాన్ ఇండియా హీరోగా మారాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో ప్రేక్షకులు ఈ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా లో అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. సినిమాలో ప్రతీ సన్నివేశం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సిని ప్రముఖులను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన దర్శకుడూ పూరి జగన్నాథ్ కూడా సినిమా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరీ జగన్నాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమా క్లైమాక్స్ లో హీరో విలన్ ఇద్దరు కూర్చొని హ్యాపీగా, కామ్ గా మాట్లాడుకోవటం చాలా కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు.

సాధారణంగా అన్ని సినిమాల క్లైమాక్స్ లో ఫైటింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమా క్లైమాక్స్ ఫైటింగ్ లేకుండా చాలా కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమా గురించి పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. బాక్సింగ్ నేపత్యం లో తెరకెక్కిన ఈ సినిమా మీద పూరి చాలా నమ్మకం పెట్టుకున్నాడు.