కోట్లు ఖర్చు చేసి ముంబైలో ఇంద్రభవణం లాంటి ఇల్లు కోనుగోలు చేసిన సమంత.. ఖరీదెంతో తెలుసా..?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత ఆ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసర నటిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నాగచైతన్యని వివాహం చేసుకుంది.

ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో చాలాకాలం ఒకరినొకరు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహం జరిగిన మూడు సంవత్సరాల వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్నా వీరిద్దరూ ఆ తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని ఒకరికొకరు దూరమయ్యారు. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కొంతకాలం చాలా డిస్టర్బ్ అయ్యింది. ఆ సమయంలో ముంబైకి మఖాం మార్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సమంతకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. సమంత దాదాపు 30 కోట్ల రూపాయల ఖర్చు చేసి ముంబైలో ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొలుగోలు చేసినట్లు తెలుస్తోంది. బీచ్ వ్యూ తో సకల సదుపాయాలతో ఉండే ఆ ఇంటిని సమంత ఎంతో ఇష్టపడి కోనుగోలు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.