తన సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యలయం) టీమ్‌పై జగన్‌కు అప్పుడే మొహం మొత్తేసింది. అందుకే దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రెడీ అయ్యాడు. త్వరలో సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను వదిలించుకోనున్నాడు. నిజానికి ప్రవీణ్ చంద్రబాబుకు బాగా దగ్గరి వ్యక్తి. ఢిల్లీలో బలమైన లాబీయింగ్ ఉండడంతో వీహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్) ద్వారా జగన్‌కు దగ్గరై ఏపీ సీఎంఓలో పాగా వేసి చక్రం తిప్పాడు. ప్రవీణ్ వచ్చాక జగన్‌కు బాగా కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలామంది ఇబ్బంది పడ్డారు. మాదిరెడ్డి ప్రతాప్ వంటి కొందరైతే దూరమయ్యారు కూడా. ప్రవీణ్ ఆధిపత్యం పెరిగిపోయి తారాస్థాయికి చేరింది. దీంతో ఆయన నిర్ణయాలు జగన్‌కు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాయనే గగ్గోలు మొదలైంది. అన్నీ తెలిసినా ప్రవీణ్ సామర్థ్యాన్ని గుర్తించి అతన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకున్న జగన్ ఇప్పుడు తెలివిగా పావులు కదపడం మొదలుపెట్టాడు.
ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌దాస్‌ను చీఫ్ సెక్రటరీ రేసులోకి తీసుకొచ్చాడు. నీలం సాహ్ని తర్వాత దాస్‌ను సీఎస్‌ను చేయడానికి పావులు కదిపాడు. ఆదిత్యనాథ్‌కు ప్రవీణ్ పేరు చెబితే చిర్రెత్తుకొస్తుంది. సీఎస్ పదవి చేపట్టేందుకు ఒకే చెప్పి ఒక కండీషన్ పెట్టాడు. అది ప్రవీణ్‌ను సీఎంఓ నుంచి సాగనంపడం. సీఎస్‌పైనే పెత్తనం చేసే టీమ్ ఉంటే తాను పనిచేయలేనని చెప్పడం, అందుకు జగన్ ఒకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విషయం అర్థమైన ప్రవీణ్ ప్రకాష్ మెల్లగా ఏపీ నుంచి తప్పుకుని ఢిల్లీలోని పీఎంఓ ఆఫీసులో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
సీఎం జగన్ ఆదిత్యనాథ్‌దాస్‌ను సీఎస్ చేస్తాడో లేదో తెలియదు కానీ ఆ బూచీ చూపి ప్రవీణ్‌కు ఎసరు పెట్టేశాడు. అతని స్థానంలో ఎస్‌ఎస్ రావత్‌ను సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా పెట్టే అవకాశం ఉందంటున్నారు. మరో సీనియర్ ఐఏఎస్ పీవీ రమేష్‌ను సాగనంపనున్నారు. ధనుంజయ్‌రెడ్డి, సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఎలాగూ తన మనుషులే. వీరిద్దరినీ అలాగే ఉంచి కొత్తగా ఐఏఎస్‌లు కోన శశిధర్, రేవు ముత్యాలరాజు (పశ్చిమగోదావరి కలెక్టర్), వినయ్‌చంద్ (విశాఖ కలెక్టర్)ను సీఎంఓలోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నాడు.మొత్తంగా ఏడాదిన్నర తర్వాత తన సీఎంఓ టీమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు జగన్ వేస్తున్న అడుగులు, కదుపుదుతున్న పావులు ఆసక్తికరంగా మారాయి.