Home TR Exclusive కేటీఆర్‌ వెనక్కి, హరీష్‌రావు ముందుకి.. ఈ కొత్త కథేంటీ.!

కేటీఆర్‌ వెనక్కి, హరీష్‌రావు ముందుకి.. ఈ కొత్త కథేంటీ.!

తెలంగాణ రాష్ట్ర సమితిలో ‘నెంబర్‌ టూ’ ఎవరు.? అంటే, ఖచ్చితంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావేనని అందరూ చెబుతారు. కానీ, ఇప్పుడు సీన్‌ మారిందట. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత పార్టీలో కొన్ని కీలక మార్పులు చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారట. హరీష్‌రావుని ముందు పెట్టి, కేటీఆర్‌ ప్రాధాన్యతను కాస్త తగ్గించబోతున్నారట కేసీఆర్‌. దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యత మొత్తం హరీష్‌రావు తీసుకున్నా, అక్కడ టీఆర్‌ఎస్‌ని ఆయన గెలిపించలేకపోయారు. అయినాగానీ, హరీష్‌రావు సామర్థ్యాన్ని కేసీఆర్‌ తక్కువగా అంచనా వేయలేరు.

Who Is 'Number 2' In Trs Party
Who is ‘Number 2’ in TRS party

ఎందుకంటే, కేసీఆర్‌ అపర చాణక్యుడు.. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగిందో ఆయన తేలిగ్గానే గుర్తిస్తారు. గత కొంతకాలంగా హరీష్‌రావుకి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతున్న వైనంపై టీఆర్‌ఎస్‌లోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కానీ, ‘అదంతా ఉత్తదే..’ అని కొట్టి పారేశారు హరీష్‌రావు. హరీష్‌రావుకి సంబంధించి ఏనాడూ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది లేదు. ఎవరేమనుకున్నా, పార్టీకి వీర విధేయుడిగా ఆయన కొనసాగుతూనే వున్నారు. తనకు అప్పగించిన బాధ్యతల్ని ఆయన పూర్తిస్థాయిలో నిర్వహిస్తుంటారు. ఆ సంగతి అందరికన్నా బాగా కేసీఆర్‌కే తెలుసు. అందుకే, కీలకమైన ఆర్థిక శాఖను హరీష్‌రావు చేతుల్లో పెట్టారు కేసీఆర్‌. అంతకు ముందు పార్టీలో కొన్ని పరిణామాలు, హరీష్‌ని బాధించేలా కన్పించాయన్నది నిర్వివాదాంశం. అయితే, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీలో హరీష్‌రావు ప్రాబల్యం పెరుగుతోంది. కాదు కాదు, హరీష్‌రావు పట్ల గౌరవం పెరుగుతోంది. అలాగని, కేటీఆర్‌ పట్ల గౌరవం తగ్గుతోందని కాదు. పార్టీని గ్రౌండ్‌ లెవల్‌లో మరింత బలోపేతం చేసే దిశగా కేసీఆర్‌, హరీష్‌ – కేటీఆర్‌కి సమాన బాధ్యతలు అప్పగించబోతున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -

Related Posts

హెరిటేజ్ ఎవరిది.? ఈ ప్రశ్నకు బదులేది.?

'హెరిటేజ్ అనే సంస్థతో నాకు సంబంధం లేదు. సంబంధం వుందని ఎవరైనా నిరూపిస్తే, బస్తీ మే సవాల్..' అంటూ కొన్నాళ్ళ క్రితం ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు ఆవేశంతో ఊగిపోయారు. ఇప్పుడు ఆయనే,...

ఉత్సవం సరే, కోవిడ్-19 వ్యాక్సిన్ సరిపడా వుందా మోడీజీ.?

మాటలు కోటలు దాటేస్తాయ్.. చేతలు మాత్రం గడప కూడా దాటవ్.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పని తీరు గురించి ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పగలం.? పెద్ద నోట్ల రద్దు నుంచి, కరోనా...

రివ్యూ : వకీల్ సాబ్

చిత్రం: వకీల్‌సాబ్‌ నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌ నటీనటులు: పవన్‌ కళ్యాణ్‌, నివేతా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌, శ్రుతిహాసన్‌, ముకేష్‌ రుషి సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌ సంగీతం: ఎస్‌.థమన్‌ రచన, దర్శకత్వం: శ్రీరామ్‌...

Latest News