కులాలు, మతాలు లేని రాజకీయాలు చూడాలని చాలామంది నేతలు ప్రయత్నించారు. అయితే అది నెరవేరదని తెలిసి వాళ్ళు కూడా తమ కుల రాజకీయాల్లో చేరిపోయారు. మన రాజకీయ నాయకులు కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. వల్లనే గెలిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సీట్ పై ఒక వింత, విచిత్రమైన, పనికిరాని, పనికి మాలిన విషయం ఒకటి వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953 లో ఏర్పడిన తరువాత కొన్ని ప్రధాన సామాజిక వర్గాల నేతలు ఏపీకి సీఎంలుగా పనిచేశారు. అందులో బ్రాహ్మణులు, దళితులు, వెలమలు, వైశ్యులు ఉన్నారు. ఇక అత్యధిక కాలం ఈ రాష్ట్రాన్ని పాలించింది రెడ్లు, కమ్మలు. అయితే కాపులకు మాత్రం ఇప్పటి వరకు సీఎం పదవి దక్కలేదు. అత్యధిక జనాభా ఉన్న తమకు సీఎం పదవి దక్కకపోవడం ఏంటని కాపులు బాధపడుతున్నారు.
ఈ బాధను, ఆవేదనను తమకు అనుకూలంగావాడుకోవడానికి భారతీయ జనతా పార్టీని ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కాపులలో ఉన్న బాధను అర్ధం చేసుకున్న బీజేపీ వారిని తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది. ఫలితంగా ఏపీ బీజేపీలో పెను మార్పులు వచ్చేశాయి. మొదట్లో బ్రాహ్మణులు, వైశ్యులు, కాపుల పార్టీగా ఉన్న బీజేపీ వెంకయ్యనాయుడు, హరిబాబు వంటి వారి హయాంలో కమ్మల ఆధిపత్యం గల పార్టీగా మారిపోయింది. ఓ విధంగా చెప్పాలంటే తెలుగుదేశానికి బీ టీంగా మారింది. దాంతో కాపులు ఎక్కడ చూసినా ద్వితీయ శ్రేణి పౌరులే అయ్యారు. ఇపుడు బీజేపీ మాత్రం ఇది మీ పార్టీయే అనుకోమంటోంది.
పార్టీలో చేరి తమ తమ కులానికి చెందిన నేతను సీఎం పదవిలో కూర్చోబెట్టుకోమంటుంది. టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు క్షిణిస్తున్న తరుణంలో బీజేపీలో చేరాలనుకున్న కమ్మలకు ఇప్పుడు చిక్కు ఎదురైంది. బీజేపీ నాయకులు కాపులకు పెద్ద పీఠ వేస్తూ, వల్ల కిందనే కమ్మలు పని చేయాలనే ధోరణిలో సాగుతుందని రాజకీయ వర్గాలు చర్చించునుకుంటున్నాయి. ప్రజలు ఈ కులాల పేరిట, మతాల పేరిట ఓట్లు వేయకుండా మంచి పనులు చేసే నాయకులకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులకు ఓట్లు వేయాలని, సీఎం పదవిపై ఎలాంటి కుల రాజకీయాలు చేయడం తగదని రాజకీయ ప్రముఖులు చెప్తున్నారు.