జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్ర ఇప్పటికి రెండు దశలు పూర్తిచేస్తుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని సెలక్టివ్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లల్లో రెండో దశ కొనసాగిన సంగతి తెలిసిందే.
అయితే ఉమ్మడితూర్పు గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభంపై అవాకులూ చెవాకులూ పేలిన పవన్… ఫలితంగా ఆయన రాసిన లేఖలతో ఇరుకున పడ్డారు. ఇందులో భాగంగా… పవన్ పూర్తిగా బేస్ అయ్యారని చెబుతోన్న కాపు సామాజికవర్గ ఓట్లలో చీలిక తెచ్చారని అంటున్నారు. ఫలితంగా వారహియాత్ర అనంతరం ఈస్ట్ లో జనసేనకు డ్యామేజీ జరిగిందనే మాటలు వినిపించాయి.
ఇదే సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండో విడత వారాహి యాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు సభలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, వారి సహాయం పొందుతోన్న సామాన్యులు సైతం పవన్ పై ఫైరయ్యరు. దీంతో వారందరి దృష్టిలో పవన్ శతృవయ్యారు!
గత రెండు దశల్లోని వారాహియాత్రలో భాగంగా జనసేనకు కలిగిన ప్రయోజనాలు ఇవి. ఫలితంగా ఈ వారాహియాత్ర వల్ల ప్రభుత్వంపై బురదజల్లి అభాసుపాలవ్వడం మినహా… జనసేనకు రాజకీయంగా ఒరిగిందేమీ లేదనేది జనసేన నాయకులు, కార్యకర్తల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది.
ఈ సమయంలో పవన్ త్వరలో వారాయి మూడో దశను ప్రారంభించాలని భావ్సితున్నారని తెలుస్తోంది. అవును… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధయాత్ర మూడవ విడత తొందరలోనే ఉత్తరంధ్రా జిల్లాలలో మొదలు కాబోతోంది. అది కూడా ఉత్తరాంధ్రా ముఖద్వారం అయిన విశాఖ నుంచి ఆగస్ట్ నెలలో ఈ యాత్ర స్టార్ట్ అవుతోంది.
దీంతో ఉత్తరాంధ్రలోని జనసేన నేతలు, జనసైనికులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. నిన్నమొన్నటివరకూ బలంగా ఉన్నట్లు సంకేతాలొచ్చిన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని యాత్ర చేపట్టిన పవన్… అక్కడ జనసేనకు కావాల్సినంత డ్యామేజ్ చేశారని అంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో ఈసారి ఏ విషయాన్ని ఎత్తుకుంటారు.. ఎలాంటి డ్యామేజ్ చేస్తారో అని ఆ ప్రాంత జనసైనికులు వాపోతున్నారని సమాచారం.
అయితే ప్రస్తుతం అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్… ఉత్తరాంధ్ర ప్రయటనలో భాగంగా కచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుందని… అలాకానిపక్షంలో పవన్ మరో టైం వేస్ట్ ప్రోగ్రాం చేసినట్లే అవుతుందని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.