అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్.! ఆహా.. ఏం దెబ్బ కొట్టావ్.?

‘ఆహా అన్‌స్టాపబుల్’ టాక్ షో, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తాలూకు టీజర్ రానే వచ్చింది. టీజర్ చెత్తగా వుండబోతోందని ముందే చాలామంది ఫిక్స్ అయిపోయారు.

ఆ టాక్ షో ‘ఆహా’ వేదికగా వస్తుండడం, అది అల్లు అరవింద్‌కి చెందినది కావడంతో, సహంగానే పవన్ కళ్యాణ్ మీద కొంత నిర్లక్ష్యం వుంటుందని చాలామంది ఊహించారు. అలా ఊహించినవారూ పవన్ కళ్యాణ్ అభిమానులే.

ప్రభాస్ ఎపిసోడ్ కంటే అదిరిపోవాలని పవన్ అభిమానులు కోరుకున్నారుగానీ, ఆ జోరు కనిపించడంలేదు. టీజర్ అయితే దారుణంగా వుంది. చాలా నాసిరకంగా వుందనే విషయం అందరి నోటా వినిపిస్తోంది.

అయితే, టీజర్ చూసి ఓ నిర్ణయానికి వచ్చేయొద్దంటూ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. కానీ, అల్లు అరవింద్ కావాలనే పవన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేశాడనీ, దానికి బాలయ్య తనవంతుగా కృషి చేశాడనీ పవన్ అభిమానులు తిట్టిపోసే పరిస్థితి వచ్చింది. నిజంగా అలా జరుగుతుందా.? పవన్ కళ్యాణ్‌ని పిలిచి అవమానించారా?