దాస్ కా ధమ్కీ.! ఎన్టీయార్‌ని ఇరికించేశాడా.?

‘నువ్వు దర్శకత్వం చేయడం మానెయ్..’ అంటూ జూనియర్ ఎన్టీయార్ సరదాగానే స్వీట్ వార్నింగ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్‌కి ఇచ్చాడా.? ఈ విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో ‘మాస్ అమ్మ మొగుడు’ తరహా సినిమాకి దర్శకత్వం వహించాలని వుందంటూ విశ్వక్ సేన్ మనసులో మాటని బయటపెట్టేశాడు. అయితే, ఈ విషయాన్ని నెటిజన్లకు చెప్పే ముందే, యంగ్ టైగర్ ఎన్టీయార్ ముందు అలాంటి ఓ ప్రతిపాదన కూడా వుంచాడట విశ్వక్ సేన్.

విశ్వక్ సేన్ ప్రతిపాదన విన్నాకనే, ‘బాబోయ్, నువ్వైతే దర్శకత్వం చెయ్యడం మానెయ్’ అని జూనియర్ ఎన్టీయార్ చెప్పాడనీ, నేరుగా ఆ మాట విశ్వక్ సేన్‌కి చెప్పి, అదే మాటని ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో, అభిమానుల సాక్షిగా ఇంకోసారి అతనికి విడమర్చాడనీ అంటున్నారు.

విశ్వక్ సేన్ మాత్రం సీరియస్‌గానే వున్నాడట. ఎన్టీయార్ కుదరదంటే, బాలయ్యనైనా డైరెక్ట్ చేసేస్తానంటున్నాడట ఈ మాస్ కా దాస్.! ఏంటీ, నిజమేనా.? ‘దాస్ కా ధమ్కీ’ పబ్లిసిటీ వ్యవహారమా.?