ప్రెస్‌మీట్స్‌లో పెయిడ్‌ బ్యాచ్‌.. దటీజ్‌ కొడాలి నాని.!

సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీలు నడవడం అన్నది ఇప్పుడున్న రోజుల్లో ఆశించలేం. ఆయా అంశాల ప్రాతిపదికన రాజకీయ విమర్శలు చేయడం అన్నది కూడా చాలా అరుదైన వ్యవహారంగా మారిపోయింది. ప్రజల్లో ఏ అంశం చర్చకు రావాలి.? అన్నది రాజకీయ పార్టీలే డిసైడ్‌ చేస్తున్నాయి. మారిన రాజకీయాల్లో ఇదొక చిత్ర విచిత్రమైన పరిస్థితి. ప్రతిపక్షం పనే, అధికారపక్షాన్ని విమర్శించడం. విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పడం అధికారపక్షం పని. అయితే, ఇక్కడే వ్యక్తిగత విమర్శలు రాజ్యమేలుతుండడం.. అసలు సమస్యలు అటకెక్కిపోవడానికి కారణమవుతోంది.
kodali nani press meet
kodali nani press meet

ప్రెస్‌ మీట్స్‌ పెట్టేది జీతాల కోసమా.?

ప్రెస్‌ మీట్స్‌లో పెయిడ్‌ బ్యాచ్‌.. అనే విమర్శ గతంలోనూ వినిపించింది. ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి మరీ ప్రెస్‌మీట్స్‌ కోసం నేతల్ని ఆయా పార్టీలు తీసుకొస్తుంటాయని చంద్రబాబు హయాంలో వైసీపీ మీద విన్పించాయి. ఇప్పుడు అదే విమర్శ వైసీపీ నేతలు, టీడీపీ మీద చేస్తుండడం గమనార్హం. కాగితాలు పట్టుకువచ్చి, ప్రెస్‌మీట్స్‌లో అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడిపోతున్నారు.
kodali nani press meet
kodali nani press meet

ఆ నేతలపైనే ఎందుకు ఆ విమర్శలు.?

వర్ల రామయ్య, దేవినేని ఉమ సహా ఓ డజను మంది నేతల విషయంలో మంత్రి కొడాలి నాని తరచూ ఈ తరహా విమర్శలు చేస్తుంటారు. కొడాలి నాని ఒకరే కాదు, పేర్ని నాని సహా మరికొందరు మంత్రులూ టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ‘పెయిడ్‌ బ్యాచ్‌’ ఆరోపణల్ని తెరపైకి తెస్తున్నారు. ‘ప్రత్యేకించి జీతాలు ఇచ్చి మరీ ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నారు..’ అనే విమర్శ టీడీపీ కార్పొరేట్‌ రాజకీయాల వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోందని అనుకోవాలేమో.!
ఇక్కడ ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు.. ‘అందరూ సర్వమంగళ మేళమే..’ అన్నట్టు.. చాలా రాజకీయ పార్టీల్లో ఈ విమర్శ విన్పిస్తోంది. అయితే, టీడీపీనే తమ వ్యూహం బూమరాంగ్‌ అయ్యి, తమనే ఆ పాపం వెంటాడుతుండడంతో నీరసంగా నిట్టూర్చాల్సి వస్తోంది. రాజకీయాల్లోకొచ్చేది ‘సేవ’ కోసం అనేది ఒకప్పటి మాట. అధికారంలో లేకపోయినా, జీతాలొచ్చేస్తున్నాయంటే.. ఇది కదా నయా ట్రెండ్‌ రాజకీయం అంటే.