నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి సమస్య చాలా మందికి రోజువారీగా ఎదురవుతోంది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేయడం, స్ట్రెస్, ప్రయాణాలు, నిద్రలేమి.. ఇవన్నీ కలిసి తలనొప్పిని మరింతగా పెంచేస్తున్నాయి. దీంతో చాలామంది వెంటనే మందులు వేసుకుని రిలీఫ్ కోసం ప్రయత్నిస్తారు. అయితే మందులు అధికంగా వాడటం శరీరానికి అంత మంచిది కాదు. అయితే ఒక సులభమైన, ఖర్చు లేకుండా, ఇంట్లోనే చేయగల పద్ధతి ఉంది.. అదే ఐస్ వాటర్ థెరపీ. ఇలా చేస్తే కొన్ని నిమిషాల్లోనే ఒత్తిడి తగ్గి తలనొప్పి మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఐస్ వాటర్‌లో చేతులను కాసేపు ముంచడం లేదా ఐస్ ముక్కలను బట్టలో చుట్టి తల, మెడ, నుదురు, కళ్ల కింద, కనుబొమ్మల పైభాగంలో సున్నితంగా రాయడం వల్ల వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇది కేవలం భావన మాత్రమే కాదు, శాస్త్రీయ ఆధారమూ ఉంది. 2013లో Journal of Painలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఐస్ ఎక్స్‌పోజర్ వల్ల వాగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. దీని వలన శరీరం రీలాక్స్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో మనసు ప్రతికూల ఆలోచనల నుంచి దూరమై సానుకూల దిశగా ఫోకస్ అవుతుంది.
వాగస్ నర్వ్ యాక్టివేషన్‌తో పాటు మెదడులో dopamine అనే ‘హ్యాపీనెస్ హార్మోన్’ విడుదల అవుతుంది. దీని వలన మనసు హాయిగా మారడమే కాకుండా cortisol అనే ఒత్తిడి హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. దీని ఫలితంగా సాధారణ తలనొప్పి మాత్రమే కాదు, మైగ్రేన్ వంటి తీవ్రమైన నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఐస్ వాటర్ థెరపీ వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇది మంటను తగ్గించి మెదడులో ఒత్తిడి సిగ్నల్స్‌ను శాంతపరుస్తుంది. ఐస్ క్యూబ్స్ వేసిన నీటిలో చేతులు 5 నిమిషాలు పెట్టడం లేదా నేరుగా ఐస్ ముక్కలను రాయడం వల్ల శరీరంలోని parasympathetic nervous system యాక్టివ్ అవుతుంది. దీని వలన కేవలం తలనొప్పి తగ్గడం మాత్రమే కాదు, మనసుకు ఒకరకమైన ప్రశాంతత కూడా లభిస్తుంది.
ఆయుర్వేద నిపుణులు కూడా ఈ పద్ధతిని అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఐస్ ఎక్స్‌పోజర్ వల్ల శరీరంలో సహజంగా కలిగే హీలింగ్ మెకానిజం వేగంగా పనిచేస్తుందని వారు అంటున్నారు. మందుల వాడకం తగ్గించి సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా మంచి పద్ధతి అని వారు చెబుతున్నారు.
నిపుణుల సలహా ప్రకారం, ఐస్ వాటర్ థెరపీని ఎక్కువ సేపు చేయకూడదు. 5 నుండి 7 నిమిషాలు సరిపోతాయి. తరచుగా చేయడం వల్ల మెదడు ఫ్రెష్‌గా ఉండడమే కాకుండా స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి. ముఖ్యంగా స్ట్రెస్ లేదా టెన్షన్ కారణంగా వచ్చే తలనొప్పులకు ఇది చాలా అద్భుత ప్రయోజనం కలిగిస్తుందని చెబుతున్నారు.
తలనొప్పి వచ్చినప్పుడు మందులపై ఆధారపడకుండా, ఐస్ వాటర్‌తో చేయగల ఈ చిన్న పద్ధతి పెద్ద రిలీఫ్ ఇవ్వగలదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి క్షణాల్లో రిలీఫ్ పొందాలనుకుంటే ఐస్ వాటర్ థెరపీని తప్పక ప్రయత్నించండి. (గమనిక : ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం దృవీకరించడం లేదు.)
