మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే సీరియస్ గా యాక్షన్ లోకి దిగిన ఏపీ సీఐడీ నేతలు… మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీఐడీ పై విమర్శలు చేస్తూ.. నిరాధార ఆరోపణలు చేస్తూ.. రామోజీని వెనకేసుకొస్తున్నవారిపై కాన్సంట్రేషన్ చేయాలని నిర్ణయించుకుందట!
అవును… రామోజీరావుకే కాదు, ఆయనకు మద్దతు పలుకుతూ.. ఆయన తరుపున వకల్తా పుచ్చుకుని మాట్లాడేవారికి కూడా ఏపీ సీఐడీ షాక్ ఇవ్వనుందట. గతకొంతకాలంగా… మార్గదర్శి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ సీఐడీ విచారణలు, అరెస్ట్ లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… లైఫ్ లో మొట్టమొదటిసారి ఏపీ సీఐడీ విచారణను ఎదుర్కునే అవకాశం రామోజీరావు కి కల్పించిన అధికారులు… అనంతరం ఆయన పెద్ద కోడలు శైలజను కూడా విచారించారు. వారి వారి స్టేట్ మెంట్లను రికార్డు చేసుకున్నారు. త్వరలో విచారణ నిమిత్తం విజయవాడకు రప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.
ఆ సంగతి అలా ఉంటే… చట్టం తనపని తాను చేసుకుపోతుంటే… తగుదుతునమ్మా అంటూ మధ్యలో కొంతమంది పెద్దలు మైకులముందుకు వస్తున్నారు! ఆధారాలు చూపించకుండా రామోజీని వెనకేసుకొస్తున్నారు.. ఏపీ సీఐడీని విమర్శిస్తున్నారు. అవును… అతిపెద్ద మీడియా వ్యవస్థ ఉన్న రామోజీరావు దృష్టిలో పడితే ఫ్యూచర్ లో ప్రయోజనం ఉంటుందనో.. లేక, ఫ్రీ పబ్లిసిటీ దొరుకుందనో తెలియదు కానీ… మార్గదర్శిపై సీఐడీ విచారణను సాకుగా తీసుకుని రామోజీకి అండగా నిలుస్తున్నారు కొందరు. అయితే వీరిపై ఏపీ సీఐడీ సీరియస్ గా దృష్టి సారించిందట.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ నిధులను అక్రమంగా తరలించడాన్ని, ఆ సంస్థ చేసిన మరికొన్ని అక్రమాలను సమర్థిస్తూ మాట్లాడే వారినీ కూడా విచారించాలని సీఐడీ నిర్ణయించిందని తెలుస్తుంది. ఏయే ఆధారాలతో మార్గదర్శి అక్రమాలను, రామోజీ చేసిన పనిని సమర్థిస్తున్నారో.. మరే ఆధారాలతో ఏపీ సీఐడీని తప్పుబడుతున్నారో చెప్పాలని వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు సిద్దమయ్యారంట సీఐడీ అధికారులు.
ఈ విషయంలో తాజాగా… మార్గదర్శి అంతా చట్టబద్ధంగా చేస్తోందని.. రామోజీని వేధించడంకోసమే ఏపీ సీఐడీ కేసు పెట్టిందని ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి… ప్రధాని మోడీకి లేఖ రాశారు. యాజ్ యూజ్వల్లీ ఈనాడు పత్రిక ఆ లేఖను ప్రముఖంగా ప్రచురించింది. వీరితోపాటు రాజకీయా నాయకులు సైతం కొంతమంది తమ అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో… వీళ్లందరికీ నోటీసులు ఇవ్వాలని సీఐడీ నిర్ణయించింది.
గాలి(లో) మాటలు కాకుండా, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయకుండా… తమ వద్ద ఉన్న ఆధారాలు చూపాలని సీఐడీ కోరనుందట. మరి సీఐడీ అధికారులు తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై… ఇన్ని రోజులూ ప్రెస్ మీట్ లు పెట్టి ఏపీ సీఐడీని విమర్శించినవారు ఎలా స్పందిస్తారు, రామోజీని వెనకేసుకొచ్చినవారు ఏమని వివరణ ఇచ్చుకుంటారన్నది వేచి చూడాలి!