Donald Trump: అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు దేశ భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వలసల నియంత్రణ పై తీసుకున్న తాజా నిర్ణయం సొంత దేశానికి ఆర్థికంగా సమస్యలు తలపెట్టవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. అక్రమ వలసల నివారణకు ప్రయత్నించడం అవసరమైనా, ట్రంప్ తీసుకుంటున్న నయా విధానాలు సాధారణ వలసదారులపై దుష్ప్రభావం చూపవచ్చని అంటున్నారు.
వలసల నియంత్రణలో భాగంగా ట్రంప్ మునుపటి కాలంలోనే మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అయితే ఇప్పుడు బై బర్త్ సిటిజన్ షిప్ వంటి అంశాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్, చైనా, మెక్సికో వంటి దేశాల నుంచి ఎక్కువగా వలస వస్తున్న వారికి ఇబ్బందిగా మారనుంది. అక్రమ వలసల నివారణ సాధ్యమే కానీ, సంపూర్ణంగా వలసలను అడ్డుకోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Donald Trump: ఒకేసారి 1500 మందికి క్షమాభిక్ష.. ట్రంప్ సంచలన నిర్ణయం!

అమెరికాకు ఇమ్మిగ్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం 28 శాతం మేర ఉందని, ఇది ఇతర రంగాలతో పోల్చితే ఎక్కువని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వీసా మరియు ఇమ్మిగ్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం ఐటీ మరియు పారిశ్రామిక రంగాల కంటే అధికమని చెబుతున్నారు. ఇలాంటి కీలక ఆదాయానికి హానికలిగేలా ఈ విధానాలను అమలు చేయడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వారంటున్నారు.
ట్రంప్ చర్యలు అమెరికా భవిష్యత్తును గందరగోళానికి గురి చేయవచ్చని, గతంలో కరోనాతో ట్రంప్ తీసుకున్న పద్ధతులే ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. ఆ సమయంలో తన మొండివైఖరితో దేశాన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ పై తీసుకున్న నిర్ణయాలు అమెరికా గ్లోబల్ సంబంధాలకే కాకుండా, దేశీయ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత ఆర్థిక నిపుణులు కూడా ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలసల నియంత్రణ అవసరమైనా, ట్రంప్ వంటి సుదూర దృష్టి లేని చర్యలు ప్రపంచ దేశాలకు సైతం ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా వేగంగా మార్పులు చేయడం వల్ల మద్దతు కోల్పోవడమే కాకుండా, అమెరికా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

