అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమిని తట్టుకోలేక 2021 జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వేలాదిమందిపై కేసులు నమోదవ్వగా, ఇప్పటికీ వారు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నారు. అయితే ట్రంప్ ఇప్పుడు ఈ కేసులను పూర్తిగా రద్దు చేస్తానంటూ తన మద్దతుదారులకు ఆశావహ ప్రకటన చేశారు.
2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ క్యాపిటల్ దాడి కేసులను మాఫీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఈ కేసులను కొట్టివేయడం కోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తానని హామీ ఇచ్చారు. తన మద్దతుదారులకు ఇది సంతోషకరమైన విషయమని, వారు అనవసరంగా ఎదుర్కొంటున్న న్యాయసమస్యల నుంచి విముక్తి కల్పిస్తానని తెలిపారు.
Donald Trump: ట్రంప్ నిర్ణయాలు: భారతీయులకు ఇబ్బందులు తప్పవా?

ప్రస్తుతం ట్రంప్ తన హామీని నెరవేర్చడం ప్రారంభించారు. అధ్యక్ష హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అటార్నీ జనరల్‌కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. క్యాపిటల్ బిల్డింగ్ దాడి కేసుల్లో నిందితులపై ఉన్న అన్ని కేసులను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో దాదాపు 1500 మందికి పైగా మద్దతుదారులకు ఈ నిర్ణయం ద్వారా ఉపశమనం లభించనుంది.
ట్రంప్ చర్యలపై అమెరికా ప్రజలలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మద్దతుదారులు ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరోవైపు సమీక్షకులు ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ కేసుల మాఫీతో ట్రంప్ మద్దతుదారుల భవిష్యత్‌పై పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

