బీజేపీ క్వశ్చన్‌: టీడీపీ, వైసీపీలకు హిందువులు అక్కర్లేదా.?

రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన వాదనలు తెరపైకొస్తుంటాయి. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నాయి. ఆ ప్రస్తావన లేని రాజకీయాల్ని ఆశించడం కష్టమే. కర్నూలు జిల్లా నంద్యాలలో మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్‌ సలాం అనే ఓ వ్యక్తి, తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెను రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా తనవంతు ‘రాజకీయం’ మొదలు పెట్టేసింది.

BJP Question: Do Hindus want TDP and YCP?
BJP Question: Do Hindus want TDP and YCP?

 

టీడీపీ, వైసీపీలకు హిందువులు అవసరంలేదా.?

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఈ రోజు మీడియా ముందుకొచ్చి పోలవరం ప్రాజెక్టు సహా అనేక అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంపైనా స్పందించారు. ‘మైనార్టీ కుటుంబం గనుక, ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే, ఆరోపణలు రాగానే పోలీసుల్ని అరెస్ట్‌ చేసేశారు. ఇదెక్కడి చోద్యం.? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేస్తారా.?’ అని ప్రశ్నించేశారు సోము వీర్రాజు. అక్కడితో ఆగలేదు, టీడీపీ – వైసీపీ ‘ముస్లింల ఓట్ల కోసం’ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించిన సోము వీర్రాజు, ఆ రెండు పార్టీలకూ హిందువుల ఓట్లు అవసరం లేదా.? అని ప్రశ్నించారు.

BJP Question: Do Hindus want TDP and YCP?
BJP Question: Do Hindus want TDP and YCP?

మత రాజకీయాలు ఏపీలో బీజేపీకి ఓట్లు రాల్చుతాయా.?

కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుస దాడులు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టిపోసింది బీజేపీ. తెలుగుదేశం పార్టీపైనా బీజేపీ నానా రకాల విమర్శలూ చేసింది. కానీ, చివరికి ఏం మిగిలింది.? ఎంత గింజుకున్నా, బీజేపీకి ఆ ఎపిసోడ్‌లో పొలిటికల్‌ మైలేజీ రాలేదు. భవిష్యత్తులో ఆ తరహా మైలేజ్‌ వచ్చే అవకాశాలూ కనిపించడంలేదు.

BJP Question: Do Hindus want TDP and YCP?
BJP Question: Do Hindus want TDP and YCP?

బీజేపీకి అదే పెద్ద సమస్య

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని విమర్శించాలి, టీడీపీని విమర్శించాలి.. ఇదే బీజేపీ వ్యూహం. కానీ, ఇక్కడే బీజేపీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోతోంది. ఆ రెండు పార్టీల్నీ ఒకే గాటన కట్టేయాలనే ప్రయత్నంలో బీజేపీ నవ్వులపాలైపోతోంది.