ఎంపీ రఘురామ అక్కరలేని మిత్రుడిగా మిగిలిపోతాడ?

కొంతమందికి  తమ గొప్పతనం చూపించడం ఇష్టం. అందరూ తనను  గుర్తించానికి ఏదొక  సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటారు.  రాజకీయాలలో అయితే ఇది సర్వసాధారణం.  అధికార పక్షాన ఉన్నా, ప్రతిపక్షాన ఉన్నా తమ ఆరోపణలు తమవే.  పార్టీల అధినాయకుల దృష్టిలో కూడా వారికి ప్రత్యేక స్థానం ఉంటుందనేది వాస్తవం. ఒక్కోసారి గెలిచిన  వాళ్ళు కూడా తమ  వ్యతిరేక గళం, అసహనం అధినేత పై కూడా తెలియజేస్తారు. వీరి చర్యలు ప్రజలు మరియు ప్రతి పక్షాల దృష్టిని మరింత ఆకర్షిస్తాయి.
 
ఇదంతా విన్నాక  మీకు ఖచ్చితంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గుర్తుకు వచ్చే ఉంటాడు. గత కొన్ని  రోజులుగా ఆంధ్రా రాజకీయాలలో రఘురామ కృష్ణం రాజు అనే పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏమి మాట్లాడుతారు అనే ఆసక్తి నేతలలో…సామాన్య ప్రజల్లో నెలకొంది. వైసీపీ అస్తిత్వం, వ్యవస్థీకృత కారణం ఏదైనా… ఆయన ఆశిస్తున్న ప్రయోజనం ఏదైనా కానీ, జగన్ కి విధేయుడిని అంటూనే ఆయనతో యుద్ధం ప్రకటించారు.
 

దీనిలో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్ మరియు బీజేపీ నేతలను కలిసి వైసీపీని భయపెట్టే ప్రయత్నం చేశాడు గాని, అది పెద్దగా వర్కౌట్ కాలేదు.  తనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా తనకు బీజేపీ అండ ఉందని చెప్పడమే రఘురామ కృష్ణం రాజు అసలు ఉద్దేశం. ఇంత చేసినా ఆయనకు జరిగిన ప్రయోజనం ఏమిటీ అనేది ఆయనకే తెలియదేమో.  మొత్తానికి ఈయన ఎంపీగా కొనసాగే నాలుగేళ్లు అటు వైసీపీ దృష్టిలో నమ్మక ద్రోహిగా…ఇటు బీజేపీ దృష్టిలో అక్కరలేని మిత్రుడిగా మిగిలిపోతాడని ఖాయంగా కనిపిస్తోంది.