చంద్రబాబు ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసినా ఆయన ప్లాన్ చేసే కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు అమలు చేస్తున్న కార్యక్రమానికి ప్రజల నుంచి కనీస స్పందన కూడా రావడం లేదు. చంద్రబాబు నాయుడును ఎవరూ పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతలు ప్రజల ఇళ్లకు వెళుతుండగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి.
జగన్ స్థాయిలో పథకాలను అమలు చేయలేక పరువు పోగొట్టుకున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన పర్యటనలకు వస్తున్న జనాన్ని చూసి మురిసిపోతున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపు అని నమ్ముతున్నారు. అయితే ఆయన నమ్మకం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది. పొత్తులు పెట్టుకుందామని చంద్రబాబు ప్రతిపాదనలు పెడుతున్నా ఇతర పార్టీల నుంచి సానుకూల స్పందన రావడం లేదు.
మోదీపై గతంలో విమర్శలు చేయడం ఎంత పెద్ద తప్పు అనే విషయం చంద్రబాబుకు ఇప్పటికే అర్థమైంది. గతంతో పోల్చి చూస్తే మోదీ దగ్గర తన ప్రాధాన్యత అంతకంతకూ తగ్గుతుండటం చంద్రబాబును బాధ పెడుతోంది. పవన్ కళ్యాణ్ అయినా తనను ఆదుకుంటాడని చంద్రబాబు భావించగా అందుకు భిన్నంగా జరిగింది. సొంత పార్టీ నేతలు చంద్రబాబును నమ్మడం లేదు.
2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల ఫలితాలను మించిన దారుణమైన ఫలితాలు ఉండబోతున్నాయని జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన కలిసినా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. పాపం చంద్రబాబు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.