ఆలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు.. ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే ఫలితం లభిస్తుంది..?

to the temple after eating meat

సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసిన తర్వాత మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తారు. అయితే ఎలా గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే విషయాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. అందువల్ల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసే దేవుడిని ప్రార్థించడం వల్ల దేవుడు అనుగ్రహం పొంది కష్టాలు దూరం అవుతాయని ప్రజలు నమ్మకం. అయితే ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు గ‌ర్భ గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 సంఖ్య సత్వ ర‌జో త‌మో గుణాలని, భూర్భువస్సువర్లోకాలని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని సూచిస్తుంది. సాధారణంగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేసేప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార ముద్రతోనే ప్రదక్షిణాలు చేయాలి. గుడిలో గర్భగుడి, ధ్వజ స్తంభాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది. ఇక అరుణా చలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు. దానిని గిరి ప్రదక్షిణం అంటారు. శ్రీకృష్ణుడు ఇంద్ర యాగం మానిపించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పి చేయించాడు. అయితే గుడికి వెళ్లిన‌ప్పుడు కొంతమంది మూడు ప్రదక్షిణలు, మరికొంతమంది 5,9 ,11 ఇలా వారికి తోచినన్ని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వారి మొక్కు తీర్చుకోవటానికి 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.

ఇలా భక్తులు వారి మొక్కలు తీర్చుకోవటానికి వారికి తోచనన్ని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే గుడికి వెళ్లిన ప్రతిభక్తుడు మూడు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆపైన బేసి సంఖ్యలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో ప్రత్యేకంగా ఆలయ చరిత్ర, పురాణ విషయాలను బట్టి 108, 116 ప్రదక్షిణలు చేయాలని నియమం ఉంటుంది. కానీ సాధారణంగా ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా గర్భగుడి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు మాత్రం తప్పనిసరిగా చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాతే గర్భగుడిలోకి ప్రవేశించి దేవుడి దర్శనం చేసుకోవాలి.