హిందూ ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి పిండి వంటలు తయారు చేసే కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా మకర సంక్రాంతి చాలా ప్రత్యేకం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశికి సంక్రమించే పుష్య మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వచ్చే ఏడాది ఈ మకర సంక్రాంతి ఏ తేదీన జరుపుకోవాలి..? మకర సంక్రాంతి పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశికి సంక్రమించే పుష్య మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. 2023 సంవత్సరంలో జనవరి 15 న మకర సంక్రాంతి జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున ఖిచ్డీ తయారు చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతగా పరిగణించ బడుతుంది. మకర సంక్రాంతి రోజున సూర్యారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. వచ్చే ఏడాది జనవరి 14న రాత్రి 08.43 గంటలకు మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. అందువల్ల జనవరి 15వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. జనవరి 15వ తేదీ ఉదయం 6:47 నిమిషాల నుండి సాయంత్రం 5:47 వరకు మకర సంక్రాంతి జరుపుకోవడానికి శుభ సమయం. ఇక మకర సంక్రాంతి రోజున ఉదయం 07.15 నుంచి 09.06 వరకు మహాపుణ్యకాలం ఉంటుంది.
మకర సంక్రాంతి రోజున పూజా ప్రాముఖ్యత :
మకర సంక్రాంతి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ రోజున సూర్యదేవుడికి పూజ చేయటం వల్ల శుభం జరుగుతుంది. అందువల్ల మకర సంక్రాంతి రోజున తెల్లవారుజామున తలంటూ స్నానం చేసి సూర్యుడు ఉదయించిన తర్వాత నీటిలో ఎర్రటి పువ్వులు అక్షింతలు వేసి సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత సూర్యుని బీజ మంత్రాన్ని జపించటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇక ఈ మకర సంక్రాంతి పండుగ రోజున నువ్వులు, నెయ్యి, దుప్పట్లు, నవధాన్యాలు దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇక మకర సంక్రాంతి రోజున కొత్త ధాన్యాలతో కిచిడీ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి.