మన దేశంలో అనేక ఆచారాలు. వాటిలో చాలావరకు మంచివి.కొన్ని మధ్యలో వచ్చి చేరినవి. ప్రస్తుతం గోళ్ల గురించి తెలుసుకుందాం…
మంగళ, శుక్రవారాల్లో గోళ్లను కత్తిరించవచ్చా? మంగళవారం, శుక్రవారాలు దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవిలకు ప్రీతికరమైన రోజులు. మంగళ, శుక్రవారాలు దుర్గ, లక్ష్మీదేవికి ప్రీతికరం కావడంతో ఆ రోజున జుట్టు కత్తరించడం లేకుండా గోళ్లను కత్తరించడం చేస్తే అదృష్టం దురదృష్టం మారవచ్చు. మంగళవారం జుట్టుకు కత్తిరిస్తే.. రక్తానికి సంబంధించిన రోగాలు వస్తాయని జ్యోతిష్యగ్రంథ వివరణ.అలాగే శని, కుజుని ప్రభావంతో ఈతిబాధలు తప్పవని చెప్తున్నారు. శరీరంలో భాగమైన గోళ్లను కత్తిరించడం, జుట్టును కత్తిరించడం సరికాదని కొన్ని జ్యోతిష్యగ్రంథముల వివరణ.
అందుకే మంగళ, శుక్రవారాల్లో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదని వారు చెప్తున్నారు. మంగళవారం, శుక్రవారం పూర్తిగా గోళ్లు కత్తిరించడం నిషిద్ధం. జుట్టు కత్తిరించుకున్న నాడే గోళ్లను కూడా తీసుకోవాలి. సోమ, బుధ, గురువారాలు జుట్టు కత్తిరించుకోవచ్చు. శని, ఆదివారాలు కూడా జుట్టును కత్తిరించుకోవచ్చు. మంగళవారానికి కుజుడు ఆధిపత్యం కలిగివున్నాడు. యుద్ధకారకుడు. అందుకే అతను ఆధిపత్యం వహించే రోజున కాకుండా ఇతర రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవడం ఉత్తమం. సూర్యోదయానికి పూర్వమే, స్నానాదికాలు చేసేందుకు మునుపే గోళ్లను తొలగించుకోవాలి. అలాగే ఇంటి బయట మాత్రమే గోళ్లను కత్తిరించాలి. పెద్దలు చెప్పిన మాటలను పాటించడం వల్ల ఉపయోగమే తప్ప నష్టం రాదు.