సాధారణంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక దేవాలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దేవాలయానికి వెళ్లిన దేవుడిని దర్శనం చేసుకోవడానికి ముందు గురు చుట్టు ప్రదక్షిణాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఆలయానికి వెళ్లిన తర్వాత మొదట గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటారు. అయితే గుడికి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే విషయంలో చాలామందికి అనుమానం ఉంటుంది. ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా గుడికి వెళ్ళిన తర్వాత చాలామంది గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటారు. భక్తులు ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర నుండి వారి ప్రదక్షణ ప్రారంభిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే సమయంలో ఏదైనా దోషం ఉన్నవారు ఆ దోషాలను బట్టి 9,11 ప్రదక్షిణలు చేయాలి. సాధారణంగా శివాలయంలో ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. కానీ శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణం చేయాలి. ఇక ఏదైనా అమ్మ వారి గుడికి వెళ్ళినప్పుడు 9,11 ప్రదక్షిణలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన భక్తులు 5,9,11 ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళిన భక్తులు 9,11 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే సాయిబాబా దేవాలయాలలో కూడా 9,11 ప్రదక్షణలు చేస్తారు. ఇక గణపతి ఆలయంలో 5,9 ప్రదక్షణలు చేయాలి . అంతే కాకుండా గణపతి ముందు 11 గుంజిళ్ళు తీయటం వల్ల ఆ గణపతి అనుగ్రహం పొందవచ్చు. అయితే ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో మన మనస్సును, మన ధ్యాస అంతా కూడా ఆ దేవుని పై ఉంచి దేవుని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షనలు చేసినప్పుడే మనం చేసే ఆ ప్రదక్షణాలకు అర్థం ఉంటుంది.