దీపావళి రోజున సూర్యగ్రహణం.. ఈ చిన్న పనిచేస్తే చాలు అంతా శుభం?

సాధారణంగా ప్రతి ఏడాది సూర్య చంద్ర గ్రహణాలు రావడం సర్వసాధారణం అయితే ఈ ఏడాది దీపావళి పండుగ రోజున సూర్యగ్రహణం ఏర్పడింది.అయితే ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించకపోయిన ఈ సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారిపై ఉంటుందని చెప్పాలి. కొన్ని సంవత్సరాల తర్వాత దీపావళి రోజున ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడటంతో గ్రహణ ప్రభావం మనపై ఉండకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే గ్రహణ సమయంలో ఈ చిన్న పని చేయటం వల్ల ఎలాంటి ప్రభావం మనపై చూపకుండా అంత శుభ ఫలితాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం సాయంత్రం 4:22 నుండి 6.30 గంటల వరకు, సూర్యగ్రహణం ప్రాంతాలవారిగా వేరువేరు సమయాలలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయంలో ఎవరు ఎలాంటి ఆహార పదార్థాలను భుజించకుండా కేవలం దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి.అలాగే మనం తాగే నీటిలోనూ చేసుకుని ఆహార పదార్థాలలోనూ కాస్త తులసి ఆకులను గరికపోచులను వేయటం వల్ల గ్రహణ ప్రభావం వాటిపై పడదు. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత కాస్త ఉప్పు నీటితో ఇల్లు మొత్తం శుభ్రం చేసిన వెంటనే స్నానం చేసి దేవత విగ్రహాలను శుభ్రంగా కడిగి పూజ చేయాలి.

ఇక గ్రహణ సమయంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో భార్యాభర్తల శారీరకంగా దూరంగా ఉండాలి అలాగే ఇక గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి పరిస్థితులలోను బయటకు రాకూడదు. అదేవిధంగా ధూపం వేయడం హారతులు ఇవ్వడం దీపాలు వెలిగించడం వంటివి కూడా గ్రహణ సమయంలో చేయకూడదు. గ్రహణ సమయంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం వల్ల మనపై ఎలాంటి గ్రహణ ప్రభావం పడదు.