ఒకే గోత్రం ఉన్నవాళ్లను పెళ్లి చేసుకోకూడదా.. అలా చేసుకుంటే ఏమవుతుందంటే?

modern-arranged-marriage

హిందువులలో చాలామంది ఆచారాలను పాటిస్తారనే సంగతి తెలిసిందే. అయితే మన దేశంలో ఒకే గోత్రం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోకూడదని పెద్దలు చెబుతారు. ఈ కులం, ఆ కులం అని కాకుండా అన్ని కులాల వాళ్లు ఈ నిబంధనను పాటిస్తారు. ఒకే గోత్రం ఉంటే వాళ్లు సోదర సమానులు కావడంతో పెళ్లి చేసుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. గోత్రం అనగా మూల పురుషుడి పేరు. గోత్ర పాలకుల పేర్లు తర్వాత కాలంలో గోత్ర నామాలుగా మారిపోయాయి.

పూజలు, యజ్ఞాలు, యాగాలలో గోత్రంను కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకే గోత్రానికి చెందిన వాళ్లు అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు అవుతారు కాబట్టి ఒకే గోత్రం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వారు గోత్రాలను బట్టి పెళ్లి చేసుకునే విషయంలో నిర్ణయం తీసుకుంటారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు గోత్రాలు వేర్వేరుగా ఉంటే మాత్రమే వాళ్ల జీవితాలు సంతోషంగా ఉంటాయి.

రక్త సంబంధీకుల మధ్య వివాహాన్ని గోత్రం నివారిస్తుందని చెప్పవవచ్చు. ఒకే గోత్రం ఉన్నవాళ్లు తెలియకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్లను సంతానానికి సంబంధించిన సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సొంత గోత్రం, తల్లి గోత్రం, అమ్మమ్మ గోత్రంలను వదిలేసి పెళ్లి చేసుకుంటే మాత్రం అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి.

ఏడు తరాల తర్వాత గోత్రం అనేది మారుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. వేరే గోత్రాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు వాళ్లకు తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. గోత్రాలకు సంబంధించి ఇంకేవైనా అనుమానాలు ఉంటే జ్యోతిష్కులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.