దేవినవరాత్రి వేడుకల్లో అమ్మవారిని ఏడోరోజు కాలరాత్రి దుర్గాదేవిగా (కొన్ని ప్రాంతాలలో) అలంకరించి పూజిస్తారు.
ఈ రోజు అమ్మవారికి క్రిష్ణ కమల పువ్వులతో అంటే నల్లకలువ లేదా నీలం రంగులో ఉండే వాటితో పూజించాలి. ఇలా అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు జీవితంలో నిర్భయంగా, ఒత్తిడి లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్య భయం, ఆర్థిక భయం, పరీక్ష భయం ఇలా ఏలాంటి భయాలైనా పోతాయి. ధైర్యంగా మీరు వాటిని సాధిస్తారు. సకల శుభాలు పొందుతారు