లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ప్రతి రోజూ ఈ నియమాలు పాటిస్తే సరి?

ఈ ఆధునిక యుగంలో డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదితే గాలికి పోయే ఈ రంగు నోట్లు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు సమాజంలో గౌరవం కోసం డబ్బు సంపాదించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు ఎంత కష్టపడి పనిచేసైనా కుడా డబ్బు సంపాదించలేక పోతున్నారు. అయితే మరి కొంతమంది ఎంత డబ్బు సంపాదించడం కూడా ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుంది. అలాంటి సమయాలలో చాలామంది రకరకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి సమయాలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం వల్ల సిరిసంపదలతో తులుతుగుతారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ప్రతిరోజు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నేను అలా వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవి చంచలమైనది. అందువల్ల లక్ష్మీదేవిని సంతోష పెట్టడానికి అనేక రకాల నియమాలను పాటిస్తూ ఉంటారు. ప్రేమ, శాంతి, ఆనందం ఉండే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కనుక ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే తల స్నానం చేసి నిష్టతో విష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఆమెకు తామర పువ్వును భక్తితో సమర్పించాలి. ఆ తర్వాత శ్రీ సూక్తాన్ని పఠించాలి. ప్రతిరోజూ ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

అలాగే ప్రతిరోజు తెల్లవారుజామునే తలంటు స్నానం చేసి ఇంటి ముఖద్వారాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పసుపు కుంకుమలతో ఇంటి గడపకు అలంకరించి స్వస్తిక్ గుర్తుతో ముగ్గు వేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఇలా చేయటం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవితో పాటు తులసిమాతకు కూడా నిష్టగా పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.