లక్ష్మీ ఆవిర్భవించిన రోజు దీపావళి !

పురాణాలలో కూడా దీపావళికి సంబంధించి అనేక ఇతివృత్తాలు కనిపిస్తాయి.. దీనిలో ప్రధానమైనది..
క్షీర సముద్రాన్ని మదించినప్పుడు విశిష్ట వస్తు సముదాయా లన్నీ అందులో నుండి ఉద్భవించాయి. త్రయోదశి నాడు ధన్వంతరి జన్మించాడని చెప్పుకున్నాం. అమావాస్య నాడు లక్ష్మి జన్మించిందట. లక్ష్మీ అనగా విస్పష్టమైన గుర్తు అవి కలిగి, వాటిపై ఆధిపత్యం కలిగిన దేవీమూర్తీ (వెలిగేరూపం) లక్ష్మీదేవి.

ఆమె విష్ణువుని చూచి ఇష్టపడిందని పురాణగాథ. విష్ణువు ఆమెను తన వక్షస్థలంలో చేర్చాడట. ఆమె అష్టవిధమైన రూపాలతో అలరారిం దట. వారే అష్టలక్ష్ములు. ఆమె జన్మదినం కనుక ఆనాడు తనను పూజించినవారికి అష్టైశ్వరాలను ప్రసాదిస్తుంది. లక్షీదేవి అమావాస్యనాడు పుట్టినందువల్లనే మన పెద్దలు అమావాస్యనాడు ఆడపిల్ల పుట్టటం శుభం అనీ, ఆపిల్ల అపురూప సుందరి, ఐశ్వర్యవంతురాలు, అదృష్టవంతురాలు అవుతుందనే నమ్మకం అనాదిగా వస్తుంది.