లెదర్ తో తయారు చేసిన వస్తువులను దేవాలయాల్లోకి అనుమతించరు…. ఎందుకంటే?

to the temple after eating meat

మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ప్రజలందరూ ఇంట్లో పూజలు చేసుకోవటమే కాకుండా దేవాలయాలకు వెళ్లి ఆ దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఎలా ప్రతిరోజు తమకి ఇష్టమైన దేవుళ్లను పూజిస్తూ ఆరాధించడం వల్ల ఆ దేవుడు అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వాసం. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసే సమయంలో ఎంతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటాము. అలాగే దేవాలయానికి వెళ్లే సమయంలో కూడా ఎంతో పవిత్రంగా నియమనిష్టాలను పాటిస్తూ దేవాలయంలోకి ప్రవేశిస్తాము. ఎందుకంటే ఆ దేవుడిని ఆరాధించే ప్రదేశంతో పాటు మనం కూడా చాలా పరిశుభ్రంగా నిష్టగా ఉండాలి. సాధారణంగా మనం గుడికి వెళ్ళిన తర్వాత గుడి బయటే చెప్పులను వదిలి కాళ్లు కడుక్కొని మరి గుడిలోకి ప్రవేశిస్తాము.

ఎందుకంటే చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్లడం వల్ల ఆ గుడి ప్రాంగణం మొత్తం ఆపవిత్రంగా మారుతుంది. అందువల్ల గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తమ చెప్పులను గుడి పైటే వదిలి కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఆలయంలోకి ప్రవేశించాలి. అయితే కొన్ని దేవాలయాలలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. కొన్ని ఆలయాలలో పురుషులు స్త్రీలు సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి గుడిలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని దేవాలయాలలో పురుషులు నగ్నంగా ఆలయంలోకి ప్రవేశించి దేవుడిని దర్శించుకోవాలని నియమాలు ఉంటాయి. అలాగే మరికొన్ని ఆలయాలలో లెదర్ వస్తువులను ఆలయంలోకి తీసుకురాకూడదు అని నిషేధం ఉంటుంది.

ఎందుకంటే లెదర్ తో తయారు చేసిన వస్తువులను చనిపోయిన జంతువుల చర్మాలతో తయారు చేస్తారు. మనం స్నానం చేయకుండా ఆలయంలోకి ప్రవేశిస్తేనే ఆ పవిత్రంగా భావిస్తాము. అలాంటిది చనిపోయిన జంతువుల చర్మంతో తయారు చేసిన వస్తువులను ఆలయంలోకి తీసుకువెళ్లడం వల్ల ఆలయ ప్రాంగణం మొత్తం అపవిత్రంగా మారుతుంది. అందువల్ల లెదర్ తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగులు, జాకెట్లు వంటి వాటిని కొన్ని ఆలయాలలో నిషేధిస్తూ ఉంటారు. ఇలా లెదర్ తో తయారు చేసిన వస్తువులను పొరపాటున మనం ఆలయంలోకి తీసుకువెళ్లినా కూడా మనం చేసిన పూజకి ఫలితం లభించదు.