దీపావళి పండుగ రోజున ఈ పనులు చేస్తే చాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు..?

మన భారత దేశంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశ ప్రజలు ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే దీపావళి పండుగను కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున మట్టి దీపాలు వెలిగించి లక్ష్మి దేవికి పూజ చేయడం వల్ల ఏడాది పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందని వినికిడి. దీపావళి పండుగ రోజున కుబేరుడికి,లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజ చేసి వారిని ఆరాధించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.

దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి అమ్మవారి కటాక్షం మనకు లభించాలంటే కొన్ని పనులను తప్పకుండా చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చేయవలసిన పనులు గురించి తెలుసుకుందాం.

• ఇంటికి లక్ష్మీ దేవిని ఆహ్వానించడానికి దీపావళి పండుగ రోజున సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం తెరచి ఉంచి.. ద్వారం వద్ద మట్టి ప్రమిదలలో నూనె వేసి దీపాలు వెలిగించాలి.

• అలాగే దీపావళి పండుగ రోజున సాయంత్రం ఏడు గంటల తర్వాత పూజ గదిలో అమ్మవారిని బాగా అలంకరించి అక్కడ కూడా మట్టి దీపాలు వెలిగించి పూజించడం శుభప్రదంగా భావిస్తారు.

• లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద, శ్రేయస్సును ఇంటి ప్రధాన ద్వారం వెనకాల ఒక చిన్న గిన్నెలో పాలని ఉంచాలి.

• అలాగే ముఖద్వారం వెలుపల శుభ్రంగా ఉంచి రంగులతో ముగ్గులు వేసి అమ్మవారిని ఆహ్వానించాలి.

• దీపావళి పండుగ రోజున కుటుంబ సభ్యులందరూ పసుపు చందనం కలిపిన పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద, శ్రేయస్సు సిద్ధిస్తాయి.

• ఇంట్లోకి సానుకూల శక్తి రావటానికి ఇంటి బయట గాలికి కదలాడే చిమ్మీలను వేలాడదీయలి.

• ఇంట్లోని అన్ని కిటికీలు శుభ్రంగా సహజ కాంతి వచ్చే విధంగా తెరిచి ఉంచాలి. సహజ కాంతి ఇంటి అన్ని మూలలకు చేరుకునేలా ఫర్నిచర్‌ను అమర్చాలి.