Oil Kumar: ఇదేందయ్యా ఇది.. 33 ఏళ్లుగా ఇంజిన్ ఆయిలే అతడి ఆహారం..!

కర్నాటక రాష్ట్రం శివమొగ్గ గ్రామంలోని ఓ వ్యక్తి జీవితం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆయిల్ కుమార్ అని పిలవబడే ఈ వ్యక్తి సాధారణ ఆహారం, పండ్లు, కూరగాయలు, రైస్, చపాతీలను మానేసి, గత 33 సంవత్సరాలుగా ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు. ఈ అసాధారణ జీవనశైలి చూసి డాక్టర్లు, సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ప్రతి రోజు ఆయిల్ కుమార్ 7 నుంచి 8 లీటర్ల వరకు వేస్ట్ ఇంజిన్ ఆయిల్‌ను బాటిల్‌లలో తీసుకుంటాడు. అద్భుతంగా అనిపించే విషయం ఏమిటంటే, ఇంత తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యంగా, బలంగా ఉండటం. స్థానికులు మరియు నెటిజన్లు అతడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్‌లలో ఆయిల్ కుమార్ గురించి వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. వీడియోలో ఆయన సన్యాసి వేషంలో, లుంగీ ధరించి, బాటిల్‌లోని ఇంజిన్ ఆయిల్ తాగుతూ కనిపించాడు.

అయితే, ఈ అసాధారణ జీవనశైలి నెట్‌వర్క్‌లో విభిన్న అభిప్రాయాలను రేకెత్తిస్తోంది. కొంతమంది నెటిజన్లు అత్యంత గ్రేట్ వ్యక్తి, ఏకైక జీవనశైలి అని ప్రశంసిస్తుండగా, మరికొంతమంది డాక్టర్లు ఇంజిన్ ఆయిల్ తాగడం ప్రాణాలకు ప్రమాదం. కిడ్నీలు, లివర్, హృదయం దెబ్బతింటాయి. కోమా లేదా మరణం కూడా జరుగవచ్చు అని హెచ్చరించారు. అయితే ఆయిల్ కుమార్ మాట్లాడుతూ, అయ్యప్ప ఆశీర్వాదం వల్లే ఈ ప్రత్యేక జీవనశైలి సాధ్యమైందని చెబుతున్నారు. ఇంతకాలం ఇలా జీవించడం తనకు పెద్దగా సమస్య కాలేదని.. ఇది తనకు అందిన దైవ సహాయం అని చెబుతున్నారు.

వాస్తవానికి, ఇంజిన్ ఆయిల్ మనుషుల శరీరానికి ఎక్స్ట్రీమ్ టాక్సిక్. దీన్ని సానుకూలంగా తీసుకుని 33 సంవత్సరాలు బలంగా జీవించడం అత్యంత అసాధారణం, విపరీతమైన జీవన విధానం. వైద్య నిపుణులు దీన్ని పరిశీలించి, దీని సైంటిఫిక్ విశ్లేషణ చేయాలని సూచిస్తున్నారు. అయితే ఆయిల్ కుమార్ స్టోరీ దేశవ్యాప్తంగా మాత్రమే కాక, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మనిషి సహజ ఆహారం తీసుకోకపోయినా, దైవ ఆశీర్వాదం, ప్రత్యేక జీవన శక్తితో జీవించవచ్చు అని ఈ కథనం పాఠకులను ఆశ్చర్యపరిస్తోంది.