ఈ వార్త కేవలం వాస్తుపై నమ్మకం ఉన్నవారికి మాత్రమే. నమ్మకం, విశ్వాసం ఉంటే కింది వాస్తు విషయాన్ని తెలుసుకుని ఆచరించండి. లేకుంటే దీని చదవకండి.
నిద్రపోవడం అంటే సాధారణ విషయం అనుకుంటాం. కానీ దీనివెనుక సైన్స్ చాలాఉంది. ప్రధానంగా ఏ దిశలో నిద్రిస్తే ఏం ఫలితమో వాస్తుశాస్త్రం విపులంగా తెలిపింది. ప్రస్తుతం తూర్పుదిశలో పడుకుంటే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం…
ఆయా గదుల్లో నిద్రించే సమయంలో ఏ వైపుగా తలపెట్టి నిద్రించాలో కూడా వాస్తు శాస్త్రం చేబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం నిర్ధేశిత దిశల్లో నిద్రించడం ద్వారా సుఖప్రదమైన నిద్ర లభిస్తుంది. అలాగే జీవితంలో కొన్ని అధ్బుత సంఘటనలు సైతం జరిగే అవకాశమున్నట్టు వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. వీరి సలహా ప్రకారం గదిలోని తూర్పు దిశగా తలపెట్టి నిద్రిస్తే అట్టి వారిలో జ్ఞానసంపద వికసిస్తుందని తెలుస్తోంది. అలాగే వీరిలో ఆధ్యాత్మిక చింతన సైతం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు దిశగా తలపెట్టి నిద్రించడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగుతుందని వారు అంటున్నారు. ఇట్టి పిల్లలు వారి చదువులో అందరికన్నా ముందుండడం జరుగుతుందని కూడా వారు చెబుతున్నారు. తూర్పు దిశగా తలపెట్టి నిద్రించే వారికి ఆరోగ్య సమస్యలు సైతం దరిచేరవని వాస్తు విజ్ఞానుల ఉవాచ. తద్వారా వీరు మంచి ఆరోగ్యంతో కులాసాగా ఉంటారని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.