లక్ష్మీదేవిని సిరిసంపదలకు ప్రతిరూపంగా ప్రజలందరూ భావిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోలను విగ్రహాలను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందటం వల్ల ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని ప్రజల నమ్మకం. అయితే కొన్ని రకాల లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో ఉంచి పూజించడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. అందువల్ల కొన్ని రకాల లక్ష్మీదేవి ఫోటోలను మాత్రమే ఇంట్లో ఉంచి పూజించాలి. ఎటువంటి లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా లక్ష్మీదేవి తామర పువ్వు పై కూర్చుని ఉన్న ఫోటోలు పూజించడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదు. అలాగే విష్ణుమూర్తి సేదతీరుతుండగ ఆయన పాదాల వద్ద లక్ష్మీదేవి ఉన్న ఫోటోలను పూజించటం వల్ల భార్య భర్తల మధ్య ఉన్న కలహాలు తొలగిపోవడమే కాకుండా ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇంటి పూజ గదిలో కుబేరుని ఫోటోలను ఉంచి పూజించటం వల్ల కూడా ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.అలాగే గరుత్మంతుడు పై లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉన్న ఫోటోలను పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
అలాగే బంగారం, వెండి, పంచలోహాలతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లో ఉంచి పూజించటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా పాదరసంతో తయారుచేసిన లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లో ఉంచి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ధన ప్రాప్తి కలుగుతుంది.
కానీ కొన్ని ఫోటోలలో లక్ష్మీదేవి గుడ్లగూబ పై కూర్చుని ఉంటుంది. అలాంటి ఫొటోలను ఇంట్లో ఉంచి పూజించటం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడటమే కాకుండా ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది.