రెండు రోజులుగా వచ్చిన దీపావళి అమావాస్య.. ఏ రోజు జరుపుకోవాలంటే…?

మన హిందూ సంప్రదాయంలో పండగలను ఎంతో సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకుంటారు. ఇలా హిందువులు ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ కూడా ఒకటి. పురాణాల ప్రకారం ప్రజలను పట్టిపీడిస్తున్న నరకాసురుడిని హతమార్చిన తర్వాత అతని పీడ తొలిగిపోయినందుకు మరసటి రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలో ప్రజలందరూ మట్టి దీపాలను వెలిగించి అమావాస్య చీకటి రోజున తమ బ్రతుకులలో వెలుగులు నిండాలని దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఈ ఏడాది దీపావళి అమావాస్య రెండు రోజులు వచ్చింది. అక్టోబర్ 24వ తేదీ సాయంత్రం మొదలైన అమావాస్య అక్టోబర్ 25వ తేదీ సాయంత్రం వరకు ఉంటుంది. అందువల్ల ఈ రెండు రోజులలో ఏ రోజున దీపావళి పండుగ జరుపుకోవాలని ప్రజలు అయోమయంలో ఉన్నారు. అయితే పండుగ ఏ రోజు జరుపుకోవాలన్నది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు.

దీపావళి అమావాస్య అక్టోబర్ 24వ నా సాయంత్రం 5:27 గంటలకు మొదలై అక్టోబర్ 25వ తేదీన సాయంత్రం 4 గంటల 18 నిమిషాలకు ముగుస్తుంది. అయితే 25 తేదీన సూర్యగ్రహణంతో పాటు రాత్రికి పాడ్యమి తేదీ కూడా వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అందువల్ల ఈ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి అక్టోబర్ 24 వ తేదీ శుభ సమయం అని నిపుణులు తెలియజేస్తున్నారు. కావున ప్రజలందరూ అక్టోబర్ 24వ తేదీ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.