ఇంట్లో కామదేనువు విగ్రహాన్ని పెడుతున్నారా.. ఏ ప్రదేశంలో పెట్టాలో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాలను ఎలా నమ్ముతారో వాస్తు శాస్త్రాన్ని కూడా అంతే నమ్ముతారు. మనం ఏ చిన్న పని చేయాలన్నా ముందుగా వాస్తు శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఆ పనులను చేపడతారు.మన ఇంట్లో ఒక వస్తువును అలంకరించుకోవాలన్న వాస్తు శాస్త్రం ప్రకారం ఆ వస్తువును సరైన దిశలో ఉంచుతారు. ఇకపోతే శాస్త్రం ప్రకారం ఇంటిలో కామదేనువు ఉండటం వల్ల ఎంతో శుభమని పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.

కామదేనువు అంటే సాక్షాత్తు సకల దేవతల స్వరూపమని భావిస్తారు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరు ఇంటిలో ఆవును పెంచుకొని పూజించేవారు.ప్రస్తుత పరిస్థితులలో ఆవులను పెంచుకోవడం వీలుపడని వారు ఆవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇలా కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శుభ పరిణామంగా భావిస్తారు.అయితే ఎంతో పవిత్రమైన ఈ కామధేనువును ఇంట్లో ఏ దిశలో ఉంచడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయనే విషయానికి వస్తే…

కామదేనువు విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం ఎంతో మంచిది. ఇలా ఈ విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యులు మొత్తం ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెండి ఆవు దూడ విగ్రహాలను పెట్టడం ఎంతో మంచిది అది కూడా ఆవుకు పాలు తాగుతున్నటువంటి విగ్రహాన్ని పెట్టుకోవడం శుభసూచకం. వెండివి చేయించుకోలేనివారు ఇత్తడి విగ్రహాలను తీసుకోవడం కూడా శుభం.ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాలను ఈశాన్య దిశలో పెట్టడం మంచిది అలాగే దేవుడు గదిలో కూడా ఉంచి పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.