చదువు భారంగా ఉందని విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మంగళవారం ఉదయం ఒక విద్యార్థి చేసిన పని తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేసింది. దిక్కు తోచని ఆ తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. ఆ విద్యార్థి ఏం చేశాడో కింద ఉంది చదవండి.
కృష్ణా జిల్లా కంచికచర్ల ప్రయివేటు కళాశాలలో డిప్లొమా రెండవ సంవత్సరం చదువుతున్నాడు మునిస్వామి నాగరాజు. చదువు భారంగా ఉందని, చదవలేకపోతున్నాను అని, చదివినా పాస్ అవట్లేదని ఒక లెటర్ రాసి పెట్టి ఇంటి నుండి పారిపోయాడు. మంగళవారం ఉదయం తెల్లవారుఝామున ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి పారిపోయాడు. లెటర్ చూసిన తల్లిదండ్రులు బోరుమని ఏడుస్తున్నారు.
తమ కుమారుడి ఆచూకీ కనుక్కోవాలని నాగరాజు తల్లిదండ్రులు మునుస్వామి రాజు, ఈశ్వరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను అభ్యర్ధించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు కంచికచర్ల పోలీసులు.
నాగరాజు తల్లిదండ్రులు తమ కుమారుడు ఇంటి నుండి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ ఉన్న తిరిగి రమ్మని అడుగుతూ ఒక వీడియో పెట్టారు. మీ నాన్న నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నేను చూసుకుంటా ఇంటికి తిరిగి రా నాగరాజు అంటూ అతని తల్లి దీనంగా రోదిస్తుంది. వీడియో కింద ఉంది చూడండి.