తాడిపత్రిలో ప్రబోధానందకు షాక్

 

తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ప్రబోధానంద శిష్యులు 30 మందిని బుధవారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తాడిపత్రిలో ఈ నెల 15 న వినాయకుడి నిమజ్జనం నిలిపేందుకు ప్రబోధానంద శిష్యులు గ్రామస్తులపై దాడికి దిగారు. రెండు రోజులపాటు వారి మధ్యన ఘర్షణ కొనసాగింది.

ఈ దాడిలో ఒక గ్రామస్థుడు మరణించాడు. కొంతమంది గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విధ్వంసానికి కారణమైన ప్రబోధానంద శిష్యులపై సుమారు 27 కేసులు నమోదయ్యాని పోలీసులు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం ముప్పై మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు అధికారులు పేర్కొన్నారు.

ప్రబోధానంద శిష్యులను అరెస్టు చేసిన నేపథ్యంలో పోలీసు స్టేషన్ కు స్పీడ్ పోస్టులు వెల్లువెత్తాయి. ఒక్కరోజులోనే సుమారు 25 స్ప్పేడ్ పోస్టులు వాచినట్టు సమాచారం. కేవలం ప్రబోధానంద శిష్యులను మాత్రమే ఎందుకు అరెస్టు చేసారని, గ్రామస్థులను ఎందుకు చేయలేదని అడుగుతూ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రబోధానంద శిష్యగణం స్పీడ్ పోస్టులు పంపుతున్నట్టు సమాచారం. దీంతో ఈ స్పీడ్ పోస్టులు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నట్టు తెలుస్తోంది.

ఓఎస్డీ చౌడేశ్వరి ప్రబోధానంద ఆశ్రమం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆగ్రహానికి కారణం ఆశ్రమం పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పారిశుధ్య సిబ్బందిని పిలిపించి ఆశ్రమ చుట్టుపక్కల పరిసరాలు క్లీన్ చేయించారు. ఎక్కడ పడితే అక్కడ పడేసిన ఎంగిలి విస్తర్లను తొలగించి చెత్త డబ్బాలను అమర్చారు.