Gallery

Home Andhra Pradesh తాడిపత్రి ఆశ్రమం మరో డేరా: క్రిమినల్ బాబాకు జగన్ సపోర్ట్ (వీడియో)

తాడిపత్రి ఆశ్రమం మరో డేరా: క్రిమినల్ బాబాకు జగన్ సపోర్ట్ (వీడియో)

అవన్నీ పేరుకే ఆశ్రమాలు. కానీ తెరవెనుక నడిచే బాగోతాలు వేరు. ఆధ్యాత్మిక ముసుగులో ఆశ్రమంలోని బాబాలు నేరాలు, ఘోరాలు చేస్తుంటారు. వారి చీకటి సామ్రాజ్యానికి అవన్నీ అడ్డాలు. ఆశ్రమం సాక్షిగా అక్రమాలకు, అకృత్యాలకు ఒడిగడుతున్నారు దొంగ బాబాలు. అమాయక భక్తులను భక్తి చింతన వల వేసి దారుణాలకు పాల్పడుతున్నారు.

తాడిపత్రి చిన్న పొలమాడలో ఆశ్రమ భక్తులు, గ్రామస్థుల మధ్య వినాయక నిమజ్జనం విషయంలో చెలరేగిన గొడవ తారాస్థాయికి చేరుకుంది. వినాయకుడిని ఉంచిన ట్రాక్టర్ కి నిప్పు అంటించడంతో నిప్పుల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మరణించాడు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తస్థాయికి చేరుకుంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్థులతో కలిసి ఆందోళనకు సైతం దిగారు. అయితే ఆశ్రమ వర్గాలతో, జేసీ దివాకర్ రెడ్డితో అధికారులు చర్చలు జరిపి పరిస్థితులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆశ్రమంలోని భక్తులని సైతం బయటకి పంపి ఆశ్రమాన్ని ఖాళీ చేశారు.

ఈ సందర్భంగా ఆశ్రమం నుండి బయటకు వచ్చిన భక్తులు ఆశ్రమం గురించి పలు దారుణమైన విషయాలు వెల్లడించారు. ఆశ్రమంలో ఎన్నో నేరాలు జరుగుతున్నట్టు వారి మాటల ద్వారా తెలుస్తోంది. ఆశ్రమంలోని ప్రబోధానంద స్వామిజీ అక్రమ దందాలు చేసేవాడని, అతనికి దేవుళ్లంటే భక్తి లేదని బాబా ముసుగులో పాపాలు చేసేవాడని వారు అంటున్నారు. మనుషుల్ని చంపడం, ఆడవారిపై వ్యభిచారానికి పాల్పడటం ఆశ్రమంలో జరిగే దారుణాలని వారు తెలుపుతున్నారు. ఎదురు చెబితే వారిని చంపేసి పునాదుల్లో పాతి పెట్టేస్తారని వెల్లడించారు. ఇలా ఒక్కొక్కటిగా ఆశ్రమానికి సంబంధించిన నిజాలు బయటకు వస్తున్నాయి. దొంగ బాబా గురించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది చూడండి.

 

ఈ వీడియో గమనిస్తే బాబా గురించి నిజాలు బయట పెట్టే ప్రయత్నం చేసింది ప్రముఖ టీవీ ఛానల్. ఆ టీవీ ఛానెల్ కూడా వైసీపీ అధినేతదే… మరి ఆయనేమో క్రిమినల్ అంటూ వారి ఛానల్ ద్వారానే బహిర్గతం చేసిన బాబాకు మద్దతు పలకడం పలు అనుమానాలకు తావిచ్చింది. రాజకీయ లబ్ది కోసం నేరగాడికి కూడా సపోర్ట్ చేయటానికి ముందుకొచ్చాడు జగన్ అంటూ నెట్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా వెళ్ళటానికి ఇలాంటి దొంగ బాబాలకు ప్రతిపక్ష నేత జగన్ మద్దతు పలకటం సమర్ధనీయం కాదు అంటున్నారు టీడీపీ శ్రేణులు .

క్రిమినల్ బాబాల మోసాలకు బలి అవుతున్న ప్రజల్ని రక్షించాల్సిన నాయకుడు వారికి వత్తాసు పలకడంలో అర్థమేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. బాబా అక్రమాల్లో జగన్ కి కూడా హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ప్రబోధానంద లాంటి క్రిమినల్ స్వామీజీకి ఎలా సపోర్ట్ ఇస్తాడంటూ నిలదీస్తున్నారు.

ఇంకొక ఆరోపణ ఏమిటంటే ఆశ్రమంలో భక్తుల ముసుగులో గ్రామస్తులపై దాడి చేసింది కూడా వైసీపీ కార్యకర్తలే అంటూ తాడిపత్రిలో చర్చ జరుగుతోంది.  జేసీ వర్గాలకి, ఆశ్రమ వాసులకి చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అనుచరులు ఆశ్రమానికి మద్దతు ఇస్తున్నట్టు టాక్ నడుస్తోంది. 

- Advertisement -

Related Posts

టీడీపీ ప్లస్ జనసేన.. ఔను, వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యారు.!

పైకి కత్తులు దూసుకుంటున్నట్టే కనిపిస్తారు.. తెరవెనుకాల మాత్రం కలిసి పనిచేస్తారు. ఇదెక్కడి రాజకీయం.? ఈ రాజకీయమే అంత. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల తీరు ఇది. పరిషత్ ఎన్నికల ఫలితాలొచ్చాయి.. అధికార వైసీపీ,...

ఎన్నికల మూడ్: టీడీపీకి షాకిచ్చేసిన వైసీపీ

రెండున్నరేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తమవ్వాల్సిందిగా మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో దిశా నిర్దేశం చేశారన్న ఓ గాసిప్, తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసింది....

రెండున్నరేళ్ళ ముందే ఎన్నికల సన్నాహాల్లో వైఎస్ జగన్.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తవుతోంది. మరో రెండున్నరేళ్ళ సమయం వుంది వచ్చే ఎన్నికలకు. కానీ, ఇప్పటి నుంచే వైసీపీ ఎన్నికలకోసం సమాయత్తమవుతోందంటూ ప్రచారం షురూ అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్...

Latest News