ఒక వృద్ధుడి బలహీనతను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేశారు ముగ్గురు విలేకరులు. వీడియో నెట్ లో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేసి అతడి దగ్గర నుండి డబ్బు, బంగారం గుంజుకున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో బయటపడ్డ నిజాలకి పోలీసులు షాక్ అయ్యారు. దీని గురించి పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.
కృష్ణా జిల్లా, చల్లపల్లిలో జరిగిన ఉదంతమిది. 65 ఏళ్ళ వృద్ధుడు స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు. అతనికి తెలియకుండా వీడియో తీసిన విలేకరులు బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామంటూ బెదిరించి వృద్దుడి ఒంటిపై ఉన్న బంగారం, డబ్బులు లాక్కున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్ళింది. దీంతో విజయవాడలో పని చేస్తున్న సీవీఆర్ రిపోర్టర్ ఏడుకొండలు, మచిలీపట్నం సీవీఆర్ కంట్రిబ్యూటర్ కొనకళ్ల గిరి, ఐ న్యూస్ లో పని చేసే వెంకటేశ్వరరావుతో పాటు మరొక వ్యక్తిని అరెస్టు చేశారు అధికారులు.
ఇందులో మరి కొందరి విలేకరులకు కూడా ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుల్ని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించిన పోలీసులు వారి నుండి మరిన్ని నిజాలను రాబట్టేందుకు విచారణ జరిపారు. ఆ నిందితులు మరో ఐదు కేసుల్లో ఇదే విధంగా బెదిరింపులకు పాల్పడ్డారని తెలుసుకుని విస్తుపోయారు అధికారులు. ఇందులో మరి కొందరి విలేకరులకు కూడా ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే కాకుండా గుంటూరు జిల్లాలోని పెద కాకాని, బాపట్లలో కూడా వీరు ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.