కేటిఆర్ సభలో నేరెళ్ల యువకుడు ఆత్మహత్యాయత్నం (వీడియో)

సిరిసిల్లలో మంత్రి కేటిఆర్ సభలో ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సిరిసిల్లలో కలకలం రేపింది. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో కేటిఆర్ సభ జరుగుతుండగా నేరెళ్ల బాధితుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. సభలో కేటిఆర్ ప్రసంగం కొనసాగుతుండగానే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొన్నది. 

ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు నేరెళ్ల బాధితుడు. తనను చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశాడు. మా జీవితాలు నాశనం చేసిండు కేటిఆర్ అని నినదించాడు ఆ యువకుడు. కేటిఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశాడు. 

నేను ఏం తప్పు చేశానని నన్ను కేటిఆర్ పోలీసులతో కొట్టించాడని ప్రశ్నించాడు. నన్ను చంపించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఏ కారణం లేకుండా తమను పోలీసులతోటి కొట్టించిండని ఏడుస్తూ చెప్పాడు. నేరెళ్ల దళితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై కిరోసిన పోసుకున్న అతడిని పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ఆ బాదితుడి వీడియో కింద ఉంది.